లింగమయ్య కాలనీలో జన సమూహాల మధ్య నీటి కుంపటి .
*పట్టించుకోని అధికారులు,
జనం న్యూస్ 17-07-2026 అమీన్పూర్ మున్సిపల్ కార్పొరేషన్ లో లింగమయ్య కాలనీ మురికి కుంపల మారింది. వర్షాలు వస్తే మురికి నీరు అంతా తమ ఇళ్లలోకి వస్తుందని అక్కడి గ్రామస్తులు తెలియపరిచారు. ఇలా నీరు రావడం వల్ల , దోమలు , ఉండటంవల్ల చిన్నపిల్లలు, విష జ్వరాలకు గురవుతున్నారు,మున్సిపల్ అధికారులకు ఎంత చెప్పినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని వారి ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు మాకు ఓటు వేయండి అభివృద్ధి చేసి చూపిస్తాం అని ఇక్కడి నాయకులు ఓట్లు వేసేదాకా మా ఇళ్ళ చుట్టూ తిరిగి ఇప్పుడు మాత్రం ఒక్కరు కూడా కనిపించడం లేదు. అంటే గెలవకముందు ఒక మాట గెలిచాక ఇంకో మాట మాట్లాడుతున్నారు. ఇలా ఉండగా మున్సిపల్ సిబ్బందికి తెలియచేస్తే చేస్తాం చూస్తాం అంటున్నారు తప్ప ఇండ్లలోకి ఎంత నీరు వచ్చిన మమ్మల్ని పట్టించుకోవడం లేదు అని ప్రజలు తెలియజేస్తున్నారు.