మూసాపేట డిప్యూటీ కమిషనర్‌కు ఘన సన్మానం ప్రజాసేవలో నిబద్ధతకు తెలంగాణ రాష్ట్ర ఓసి సంఘం ప్రశంసలు

July 17, 2026 | తెలంగాణ

జనం న్యూస్ | జూలై 17 | హైదరాబాద్ | తెలంగాణ స్టేట్ ఇన్‌చార్జ్: శ్రీనివాస్ రెడ్డి మూసాపేట సర్కిల్ మున్సిపల్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర ఓసి సంఘం ప్రధాన కార్యదర్శి వై. భాస్కర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ప్రజలకు పారదర్శకంగా, బాధ్యతాయుతంగా సేవలందిస్తూ మున్సిపల్ పరిపాలనలో సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నందుకు ఆయనను అభినందించారు.ఈ సందర్భంగా వై. భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు నిబద్ధతతో పనిచేస్తే ప్రభుత్వంపై ప్రజల విశ్వాసం మరింత బలపడుతుందని అన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ మున్సిపల్ సేవలను మెరుగు పరిచేందుకు డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి చేస్తున్న కృషి ఆదర్శనీయమని కొనియాడారు.డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి స్పందిస్తూ, ప్రజల సహకారంతో నగరాభివృద్ధి లక్ష్యంగా మున్సిపల్ శాఖ పనిచేస్తోందని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హులకూ చేరేలా మరింత సమర్థవంతంగా సేవలందించేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. ఆత్మీయ వాతావరణంలో జరిగిన ఈ మర్యాదపూర్వక భేటీలో పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఓసి సంఘం నాయకులు, మున్సిపల్ అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper