రేపు పరిగి పట్టణానికి రాష్ట్ర మంత్రుల రాక – ఎమ్మెల్యే డా. టి. రామ్మోహన్ రెడ్డి
జనం న్యూస్ జులై 17 వికారాబాద్ జిల్లా పరిగి పట్టణం, రాష్ట్ర రోడ్లు & భవనాల శాఖ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి , రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి & వికారాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఈ నెల 18వ తేదీ (శనివారం) పరిగి పట్టణానికి విచ్చేసి, పరిగి ఎమ్మెల్యే డా. టి. రామ్మోహన్ రెడ్డి ప్రత్యేక కృషితో, ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వం లోని కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిన సుమారు రూ.185 కోట్ల విలువైన రోడ్లు & భవనాల శాఖ,అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు ఎమ్మెల్యే డా. టి. రామ్మోహన్ రెడ్డి ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు.ఈ కార్యక్రమం మధ్యాహ్నం 12:00 గంటలకు సుల్తాన్‌పూర్ క్రాస్ రోడ్ వద్ద ప్రారంభమవుతుందని, అనంతరం సుల్తాన్‌పూర్ గేట్ నుండి ఏబీఎస్ ఫంక్షన్ హాల్ వరకు భారీ కార్లు, బైకులతో ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు.అదే రోజు పరిగి మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్, వైస్ చైర్మన్ మరియు డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించబడుతుందని, అనంతరం పరిగి మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం కూడా జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు.పరిగి నియోజక వర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని, రోడ్ల విస్తరణ, మౌలిక వసతుల కల్పనకు కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.కావున పరిగి నియోజకవర్గంలోని అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, పిఎ సీఎస్ పాలకవర్గ సభ్యులు, కార్యకర్తలు, యువజన నాయకులు, మహిళా నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే డా. టి. రామ్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు.