ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు కలెక్టర్ అభినందనలు
జనం న్యూస్ 14 మే 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ గట్టు మండలంలోని మారుమూల గ్రామాలలో ఉన్నటువంటి మట్టిలోని మాణిక్యాలైన విద్యార్థినీ, విద్యార్థులు అద్భుత విజయ కేతనం ఎగురవేసిన గట్టు ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు శ్రీ రవీంద్ర ఉన్నత పాఠశాల 1988 ..89 బ్యాచ్ పూర్వ విద్యార్థులు జోగులాంబ గద్వాల్ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ చేతుల మీదుగా అందజేశారు. పురస్కారం అందుకున్న మట్టిలోని మాణిక్యాలు అద్భుతమైన ప్రతిభతో అత్యధిక మార్కులు సాధించి పాఠశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకువచ్చిన విద్యార్థులందరికీ హృదయపూర్వక అభినందనలు. తెలిపారు మీరు పడిన కష్టానికి, మీ క్రమశిక్షణకు ప్రతిఫలంగా ఈరోజు మీకు మెమెంటో సర్టిఫికెట్ తో స్మార్ట్ వాచ్‌ను బహుమతిగా అందజేస్తున్నామనీ పూర్వ విద్యార్థులు తెలిపారు. ఈ బహుమతుల వెనుక ఒక గొప్ప సందేశం ఉందనీ మెమెంటో,మీ సర్టిఫికెట్ ఇవి మీ గతాన్ని గుర్తు చేస్తాయి. అంటే మీరు ఎంత కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నారో చెప్పే సాక్ష్యాలు ఇవి స్మార్ట్ వాచ్ ఇది మీ భవిష్యత్తును సూచిస్తుంది. ఈ స్మార్ట్ వాచ్‌ను అందుకుంటున్న మీరు రేపు సమాజంలో గొప్ప స్థాయికి చేరుకుని మరెంతో మందికి మార్గదర్శకులుగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.ఈ కార్యక్రమంలో డీఈవో విజయలక్ష్మి, ఇన్చార్జి డివైఎస్ఓ రామలింగేశ్వర గౌడ్, డిపిఓ శ్రీకాంత్, ఎంఈఓ అధికారులు, సర్పంచులు ప్రధాన ఉపాధ్యాయుల గట్టు, ఇందువాసి, బోయలగూడం, తప్పెట్ల మొరుసు, ఆరగిద్ద, చాగదోన, ఇరికిచ్చాడు పిల్లల తల్లిదండ్రులు, శ్రీ రవీంద్ర ఉన్నత పాఠశాల 1988 ..89 బ్యాచ్ విద్యార్థులు హెచ్ కె బషీర్ అహ్మద్, రవికుమార్ టీచర్ రంగారెడ్డి, అమర్నాథ్, భాను ప్రకాష్ రెడ్డి, సత్యం కర్నూల్ ప్రభాకర్ మిత్రబృందం పాల్గొన్నారు.