నందికొండలో ఘనంగా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు

July 24, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్- జులై 24- నాగార్జునసాగర్ టౌన్-నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు, తమ అధినేత పుట్టినరోజును పురస్కరించుకొని కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు,హిల్ కాలనీలో మాజీ కౌన్సిలర్ రమేష్ జి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించగా, పైలాన్ కాలనీలో 7వ వార్డు ఇంచార్జ్ మక్సుద్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు, ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ కేటీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నట్లుగా తెలిపారు, తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీనీ అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఈ సందర్భంగా వారు కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ఉద్యమకారుడు హిరేఖర్ రమేష్ జి,1 వార్డు ఇన్చార్జ్ జనార్దన్ రెడ్డి,2 వార్డు ఇన్చార్జ్ మహమ్మద్ గని, 4 వార్డు ఇన్చార్జ్ విజయ్, 6 వార్డు ఇంచార్జ్ చంద్రమౌళి నాయక్,7వార్డు ఇంచార్జ్ మక్సుద్ , అర్జున్ నాయక్, లక్ష్మణ్ నాయక్, షరీఫ్, నసీర్, అస్గర్,
బిఆర్ టియు జిల్లా సెక్రెటరీ నజీర్, ధారా రవి, కేశవ్, బిశివ, అశోక్ జి, రామస్వామి, యూత్ నాయకులు శివ, బహదూర్, కోదండ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper