గృహప్రవేశ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి.
జనం న్యూస్ మే 15, వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గము పూడూరు మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు, మాజీ సర్పంచ్ గంగారం రాజేందర్రెడ్డి, రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని ఆదర్శనగర్ లో నూతన ఇల్లు నిర్మించడంతో ఆ నూతన గృహప్రవేశానికి పరిగి మాజీ శాసనసభ్యులు కొప్పుల మహేష్ రెడ్డి పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం రాజేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డికి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో దోమ మాజీ జెడ్పిటిసి నాగిరెడ్డి, దోమ మాజీ వైస్ ఎంపీపీ మల్లేశం, రాజిరెడ్డి, బిఆర్ఎస్ పరిగి మండల అధ్యక్షులు ఆంజనేయులు, ప్రవీణ్ రెడ్డి, కౌన్సిలర్ గడ్డమీది శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, అశోక్ రెడ్డి, బి ఆర్ ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు