గ్రామాల అభివృద్ధికి అధిక ప్రాథమిక మహిళా సాధికారత లక్ష్యంగా ముందుకు

May 16, 2026 | వైరల్ వార్తలు

రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్.

జనంన్యూస్ 17మే పెగడపల్లి మహిళల ఆర్థిక సాధికారత లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం సుద్దపల్లి, దోమలకుంట గ్రామాల్లో మహిళా సంఘాల వీఓ భవనాలకు మంత్రి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలోని కోటి మంది మహిళలను లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారని అన్నారు. మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించాలని లక్ష్యంతో మహిళా శక్తి పథకం ద్వారా రుణాలు అందజేసి వారి ఆర్థిక ఎదుగుదలకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి తెలిపారు. సుద్ధపల్లి గ్రామంలో రూ. 20 లక్షల అంచనా వ్యయంతో వీఓ భవనం, దోమలకుంట గ్రామంలో రూ. 10 లక్షల అంచనా వ్యయంతో వీఓ భవనానికి శంకుస్థాపన చేశామని మంత్రి తెలిపారు. రానున్న రోజుల్లో నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోని మహిళా సంఘాలకు వివో భవనాలు నిర్మాణం చేస్తామని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.అదే విదంగా బతికేపల్లి గ్రామమును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని మంత్రి హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper