ఆపదలో ఉన్న సాటి మనిషిని ఆదుకోవడమే నిజమైన మానవత్వం – దాసరి నీనన్
అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితునికి విబిఎన్ ఫౌండేషన్ ఆర్థిక సహాయం
జనం న్యూస్ -ఆగస్టు 6- నాగార్జునసాగర్ టౌన్-నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ 4వ వార్డులో నివాసముంటున్న అలిగా హరికాంత్ బుధవారం జరిగిన అగ్ని ప్రమాదంలో ఇల్లు మొత్తం కాలిపోయి నిరాశ్రయులైన విషయం గణేష్ తంగరాజు ద్వారా తెలుసుకున్న విబిఎన్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు దాసరి నినన్ ఈరోజు బాధిత కుటుంబాన్ని పరామర్శించి తక్షణ సాయం కింద కొంత మొత్తాన్ని అందించడం జరిగింది, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహాయానికి కులమతాలు లేవు సాటి మనిషికి చేయూతనందిచటమే విబిఎన్ ఫౌండేషన్ ఉద్దేశమని, ఎన్నో ఏళ్లుగా నాగార్జునసాగర్ లో నివసిస్తున్న ప్రజలందరూ అన్నదమ్ములు వలె కలిసి ఉంటూ ఒకరికొకరు ఆపదలో సహాయం చేసుకుంటూ కులమతాలకు అతీతంగా జీవిస్తున్నామని , అలాగే ఈరోజు అగ్ని ప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన హరికాంత్ కుటుంబానికి కూడా అందరం తగిన విధంగా సహాయం చేసి ఆదుకుందామని పిలుపునిచ్చారు, విబిఎన్ ఫౌండేషన్ డైరెక్టర్ నూకల చెన్నారెడ్డి మాట్లాడుతూ నాగార్జునసాగర్ ప్రజలకు ఎటువంటి ఆపద కష్టం వచ్చినా విబిఎన్ ఫౌండేషన్ తమ వంతుగా ఆదుకోవడానికి సిద్ధంగా ఉంటుందని తెలిపారు, ఈ కార్యక్రమంలో ఆయన వెంట రాకం సైదేందర్ (చిట్టి), వల్లపు నాగార్జున, షబ్బీర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.