జయశంకర్ జయంతి సందర్భంగా ఆయన కు విగ్రహాన్ని కి పూలమాల వేసి నివాళులు అర్పించిన శంకర్
జనం న్యూస్ ఆగస్టు 6 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం హన్మకొండ జిల్లా లో ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర సీనియర్ నాయకుడు తల్లి దివ్యాంగుల సేవాసమితి రాష్ట్ర అధ్యక్షులు గజ్జి శంకర్ జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఆరు దశాబ్దాల పాటు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఆవశ్యకతను ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత ఉద్యమ శిఖరం తెలంగాణ సిద్ధాంతకర్త ఉద్యమ స్పూర్తి ప్రదాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర స్వప్న సాయంకాలానికి ఆయన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా ఆ మహానుభావుడి ఆశయాలను స్మరించుకుంటూ వారికి నాయొక్క ఘన నివాళులు అర్పిస్తున్నానని గజ్జి శంకర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు పోతుగంటి సరోజన హన్మకొండ జిల్లా ఉపాధ్యక్షులు చిలుముల సుధాకర్ హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి కోగిల శ్రీకాంత్ పాల్గొన్నారు….