ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంపై రైతులు తీవ్ర ఆగ్రహం
జనం న్యూస్, ఆగష్టు 06,అచ్యుతాపురం: పూడిమడక భూ నిర్వాసిత రైతులు, అచ్యుతాపురం వన్ స్టాప్ సర్వీస్ సెంటర్ వద్ద ఏపీఐఐసి కార్యాలయంలో ఏపీఐఐసి డిప్యూటీజడ్ఎం కె.సూర్యనారాయణని కలిసి సమస్యలను వివరించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ 2004 సంవత్సరంలో సెజ్ ఏర్పాటు,కోసం భూ సేకరణ చేపట్టిన సమయంలో ప్రభుత్వం- ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ఇప్పటివరకు నెరవేర్చకపోవడంపై రైతులు తీవ్ర ఆగ్రహం,ను డిప్యూటీ జడ్ఎం వద్ద వ్యక్తం చేశారు.ఈ ప్రాజెక్టుల కోసం భూములు త్యాగం చేసిన ప్రతి నిర్వాసిత రైతు కుటుంబంలో అర్హులైన వారందరికీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని, నష్టపోయి అర్హులై ఉన్న ప్రతి కుటుంబానికి వెంటనే ఆర్-కార్డులను అందజేసి, పునరావాస ప్యాకేజీని పారదర్శకంగా అమలు చెయ్యాలని పూడిమడక నిర్వాసిత రైతులు డిమాండ్ చేయడం జరిగిందని,ఏన్టీపీసీ ” గ్రీన్ హైడ్రోజన్ హబ్” నిర్వాసిత రైతులతో సమావేశం ఏర్పాటు చేసి, ఆర్ – కార్డులు,”ఉద్యోగ-ఉపాధి ” అవకాశాలు పై సృష్టత ఇవ్వాలని,ప్రభుత్వం రాతపూర్వకంగా మరియు మౌఖికంగా ఇచ్చినటువంటి అన్ని హామీలను తక్షణమే అమలు చేయాలి.లేనిపక్షంలో నిర్వాసిత రైతు కుటుంబాలన్నింటినీ ఏకం చేసి, పెద్ద ఎత్తున ప్రత్యక్ష పోరాటాలు-నిరసనలు మరియు ధర్నాలకు దిగుతామని నిర్వాసిత రైతు నాయకులు, చోడిపల్లి అప్పారావు, ఉమ్మిడి అప్పారావు, వాసుపల్లి శ్రీనివాసరావు,మైలపల్లి మసేను రావు,మాతా గంటాలరావు తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదములుతో పూడిమడక భూ నిర్వాసిత రైతులు