సోమన్ గుర్తిలోతల్లిపాల వారోత్సవాలు

August 7, 2026 | తెలంగాణ

జనం న్యూస్ ఆగస్టు 7, ( పరిగి నియోజకవర్గం ఇంచార్జి హన్మంత్ రెడ్డి ), వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం పూడూరు మండలంలోని సోమనగగుర్తి గ్రామంలో నెం 1,అంగన్వాడి సెంటర్లో గురువారం తల్లిపాల వారోత్సవాలు కార్యక్రమం డాక్టర్ స్వప్న ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. డాక్టర్ స్వప్న మాట్లాడుతూ తల్లిపాలు బిడ్డకు తొలి టీకా వంటిదని అన్నారు. అంగన్వాడీ టీచర్ అరుణా దేవి మాట్లాడుతూ, తల్లిపాలు ప్రకృతి ఇచ్చిన వరమని ప్రసవం అయిన గంటలోపే తల్లిపాలు పట్టించినట్లయితే చిగురుపాలలో కలస్ట్రం అనే పదార్థం ఉంటుంది అందుకే తప్పనిసరిగా తల్లిపాలు తాపాలని ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, తల్లిపాలు రెండు సంవత్సరముల వరకు ఇవ్వచ్చు బిడ్డ ఆరోగ్య పరిస్థితిలో కూడా తల్లిపాలకు ఇవ్వాలి, తల్లి పాలలో విటమిన్ ఏ, డి, విటమిన్ లు సమృద్ధిగా ఉంటుందని తల్లిపాలలో అన్ని పోషక పదార్థాలు ఉంటాయని ముఖ్యంగా తల్లిపాలు తాగడం వలన తల్లికి రొమ్ము క్యాన్సర్ రాకుండా ఉంటుందని ఒక రొమ్ము మొత్తం పాలు తాగిన తర్వాత ఇంకో రొమ్ము బిడ్డకు ఇవ్వాలని తల్లిపాలు బిడ్డకు ఇవ్వడం ద్వారా తల్లి బిడ్డకు మంచిదని అన్నారు.బిడ్డకు ఏడు నెలల తర్వాత అనుసంధాన ఆహారాన్ని అందించాలని అన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ స్వప్న, ఆశ వర్కర్ లక్ష్మి,అంగన్వాడి కమిటీ సభ్యులు, ఉప సర్పంచ్ కృష్ణయ్య, వార్డు సభ్యులు రాములు, మల్లేష్, మరియు అంగన్వాడి టీచర్ అరుణా దేవి, తల్లులు, చిన్నారులు, తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper