వైభవంగా ‘వన మహోత్సవం.
జనం న్యూస్ : వనపర్తి డివిజన్ రీపోటర్ కటికల శివకుమార్ వనపర్తి జిల్లా పెబ్బేరు ఆగస్టు 07-08-2026 శుక్రవారం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించాలని పెబ్బేరు మున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. శుక్రవారం ‘వన మహోత్సవం’ కార్యక్రమంలో భాగంగా స్థానిక పెబ్బేరు మోడల్ స్కూల్ ప్రాంగణంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమోదిని, వైస్ చైర్మన్ విజయ వర్ధన్ రెడ్డి,మున్సిపల్ కమిషనర్ గణేష్, పాఠశాల ప్రిన్సిపాల్ నరేష్ సాగర్లతో కలిసి ఆయన మొక్కలు నాటారు.ఈ సందర్భంగా చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ… పెరుగుతున్న కాలుష్యాన్ని నివారించాలంటే పచ్చదనాన్ని పెంపొందించడం ఒక్కటే మార్గమన్నారు. విద్యార్థులు చిన్నతనం నుంచే పర్యావరణ స్పృహ కలిగి ఉండాలని, నాటిన ప్రతి ఒక్క మొక్కనూ బాధ్యతగా సంరక్షించాలని సూచించారు. మున్సిపాలిటీ పరిధిలో పచ్చదనం పెంపునకు, మొక్కల పెంపకానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్ గణేష్ తెలిపారు.పాఠశాల ప్రిన్సిపాల్ నరేష్ సాగర్ మాట్లాడుతూ… విద్యార్థుల్లో పర్యావరణంపై అవగాహన కల్పించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో తోడ్పడతాయని, ప్రతి విద్యార్థి ఒక మొక్కను దత్తత తీసుకుని పెంచేలా ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల కమిటీ చైర్మన్ జ్యోతి, ఉపాధ్యాయ బృందం, మున్సిపాలిటీ సిబ్బంది మరియు విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని మొక్కలు నాటే కార్యక్రమంలో ఉత్సాహంగా పాలుపంచుకున్నారు.