సమస్యలు పరిష్కరించాలని తీయన్ యాన్ పరిశ్రమ కార్మికుల ఆందోళన
జనం న్యూస్, ఆగష్టు 07,అచ్యుతాపురం:అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం సెజ్ పరిధిలో ఉన్న తీయన్ యాన్ పరిశ్రమలో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఈరోజు ఉదయం నుండి కార్మికులు విధులు బహిష్కరించి ఆందోళన నిర్వహిస్తున్నారని వీరి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్ రాము డిమాండ్ చేశారు. వేతనాల్లో కోతలు రద్దుచేసి కనీస వేతనంగా కటింగ్లు అన్నిపోయి రూ.15వేలు కార్మికులకు ఇవ్వాలని కోరారు.
