మందుల దుకాణాలు బంద్ పై తహసీల్దార్ కి వినతిపత్రం అందజేత
జనం న్యూస్ మే 18 ముమ్మిడివరం ప్రతినిధిఈ నెల 20వ తేదీన అనగా బుధవారం దేశ వ్యాప్తంగా మందులు షాపులు బంద్ నిర్వహిస్తున్నట్లు దానిలో భాగంగా,రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం లో కూడా బుధవారం మందుల దుకాణాలు బందు నిర్వహిస్తున్నట్లు, కాట్రేనికోన మండల యూనియన్ అధ్యక్షుడు వట్టూరి సూర్య నారాయణ మూర్తి (సూరిబాబు) ఆధ్వర్యంలో తహసీల్దార్ రవి కిరణ్ కి సోమవారం వినతి పత్రం అందజేశారు. ఆ రోజు కస్టమర్లకు ఎటువంటి అసౌకర్యం లేకుండా కాట్రేనికోన గేటు సెంటర్లో గల శ్రీ శివ సాయి కృష్ణ మెడికల్ షాపు తెరిచి ఉంటుందని అయన తెలిపారు.కావున ఈ బంద్ కు అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వట్టూరి మురళీకృష్ణ వింజమూరి శ్రీనివాస్,గంటి వరప్రసాద్,తాత పూడి గోపి, ఆణివిళ్ల మల్లి తదితరులు పాల్గొన్నారు.