బిజెపిజిల్లా ప్రధాన కార్యదర్శిగా ఫణీంద్ర గుప్త
జనం న్యూస్ మే 18 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీభారతీయ జనతా పార్టీ తూర్పు గోదావరి జిల్లా కార్యదర్శిగా తడవర్తి ఫణీంద్ర కుమార్ గుప్తా ను నియమించినట్టు ఒక అధికార ప్రకటనలో బీజేపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు పీక్కి నాగేంద్ర ప్రకటించారు. ఫణీంద్ర కుమార్ గుప్తా మాట్లాడుతూ విద్యార్ధి గా ఉన్నపుడు నుండి హిందుత్వం బావలు జాతీయ భావం కలిగిన అఖిల భారత విద్యార్ధి పరిషత్ లో చేరి చాలా కార్యములు చేసియున్నాను. మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ 2014 లో ప్రధాని గా ప్రమాణ స్వీకారం తర్వాత భారతీయ జనతా పార్టీ లో చేరడం జరిగింది. 2014 లోనే రాజమండ్రి అర్బన్ లో 23వ వార్డుకు యువ మోర్చా అధ్యక్షులు గా 2014-2015 వరకు బాధ్యత నిర్వహించడం జరిగింది. 2015 – 2018 రాజమండ్రి అర్బన్ జిల్లా బీజేపీ యువ మోర్చా ఉపాధ్యక్షులు గా, 2019-2021 వరకు నూతన తూర్పు గోదావరి జిల్లా కార్యదర్శి గా బాధ్యతలు నిర్వహించడం జరిగింది.పార్టీ నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అంకితభావంతో పనిచేస్తాను. పార్టీ బలోపేతానికి, కార్యకర్తల అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కృషి చేస్తాను.ఈ బాధ్యతను నాకు అందించడంలో సహకరించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ కి, రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు రాష్ట్ర ఎమ్మెల్సీ సోము వీర్రాజు కి బీజేపీ జిల్లా అధ్యక్షుడు పీక్కి నాగేంద్ర గారికి, యువ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కందుకూరి మనోజ్ బాబు కి మరియు పార్టీ సీనియర్ నాయకులకు, పార్టీ శ్రేణులకు, నా మిత్రులకు మరియు శ్రేయోభిలాషులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.భారతీయ జనతా పార్టీ మరింత బలపడేందుకు అందరి సహకారం కోరుకుంటున్నాను.