యువతలో దేశభక్తి, జాతీయతా భావాలను పెంపొందిస్తూ దేశంకోసం ఘనంగా “రన్ ఫర్ వందేమాతరం” : వడ్డేపల్లి రాజేశ్వరరావు

August 11, 2026 | తెలంగాణ

జనం న్యూస్ ఆగస్టు 11 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో, జాతీయ గీతం “వందేమాతరం” 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విశ్వహిందూ పరిషత్–బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిర్వహించిన “రన్ ఫర్ వందేమాతరం – విద్యార్థి దళ్” కార్యక్రమం కూకట్‌పల్లిలో దేశభక్తి ఉత్సాహంతో ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై యువత, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో యువత, విద్యార్థులు, దేశభక్తులు జాతీయ జెండాలను చేతబూని “వందేమాతరం”, “భారత్ మాతాకీ జై” నినాదాలతో ర్యాలీలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా వడ్డేపల్లి రాజేశ్వరరావు మాట్లాడుతూ, యువతలో దేశభక్తి, జాతీయతా భావాలను పెంపొందించడం తో పాటు సమాజం పట్ల బాధ్యతాయుతమైన ఆలోచనా విధానాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉందని అన్నారు. యువత మత్తుపదార్థాలకు పూర్తిగా దూరంగా ఉంటూ, విద్య, క్రీడలు, సేవా కార్యక్రమాల వైపు అడుగులు వేయాలని సూచించారు.“విద్యార్థి శక్తి – దేశ శక్తి” అని పేర్కొంటూ, నేటి విద్యార్థులే రేపటి భారతదేశ భవిష్యత్తుకు మార్గదర్శకులని అన్నారు. ఆరోగ్యకరమైన, క్రమశిక్షణతో కూడిన, దేశభక్తి భావాలు కలిగిన సమాజ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.వందేమాతరం వంటి దేశభక్తి గీతాలు భారత స్వాతంత్ర్యోద్యమంలో ప్రజల్లో స్ఫూర్తిని, ఐక్యతను నింపాయని, అలాంటి జాతీయ భావాలను నేటి తరానికి చేరవేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని వడ్డేపల్లి రాజేశ్వరరావు అన్నారు.కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ ప్రాంత ఉపాధ్యక్షులు మోహన్ రావు , ప్రాంత సహాయ కార్యదర్శి రమేష్,బజరంగ్ దళ్ నిర్వాహకులు, బిజెపి నాయకులు జీవన్, తిరుపతి రెడ్డి, శ్రీనివాస్ చారి, శివాచారి, మహేందర్,విద్యార్థులు, యువత, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని “రన్ ఫర్ వందేమాతరం” కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

🌐 Select Language:
📰 ePaper