తూము శైలేష్‌కు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వడ్డేపల్లి రాజేశ్వరరావు
జనం న్యూస్ ఆగస్టు 11 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి : మూసాపేట్ డివిజన్ సీనియర్ నాయకులు,మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా బీజేపీ కార్యదర్శి తూము శైలేష్ జన్మదిన వేడుకలు ఆయన నివాసం వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరరావు హాజరై తూము శైలేష్ ని శాలువాతో ఘనంగా సన్మానించి, పుష్పగుచ్ఛం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.తూము శైలేష్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి మూసాపేట్ డివిజన్లో పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ పార్టీ కోసం శ్రమిస్తున్నారని, శైలేష్ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవిస్తూ మరింత ఉత్సాహంతో ప్రజాసేవ, పార్టీ సేవలో కొనసాగాలని వడ్డేపల్లి రాజేశ్వరరావు ఆకాంక్షించారు.