జోగుళాంబ గద్వాల పోలీస్ నేరాలపై ఉక్కుపాదం.. ప్రజల భద్రతే పోలీసుల ప్రథమ ప్రాధాన్యం

August 11, 2026 | తెలంగాణ

జనం న్యూస్ 11 ఆగస్టు 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ :ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు బాధితులకు సత్వర న్యాయం సైబర్ మోసాలు ఇసుక గంజాల అక్రమ రవాణా మట్కా జూదంపై ప్రత్యేక నిఘా రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు మంత్లీ క్రైమ్ రివ్యూ సమావేశంలో జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాసరావు ఐపీఎస్ కీలక ఆదేశాలు జిల్లాలో నేరాల నియంత్రణకు మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తుతో నేరస్తులకు చట్టపరంగా శిక్ష పడేలా బాధితులకు సత్వర న్యాయం అందేలా పనిచేయాలని జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాసరావు ఐపీఎస్ అధికారులను ఆదేశించారు.మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మంత్లీ క్రైమ్ రివ్యూ సమావేశంలో జిల్లాలోని పోలీస్ స్టేషన్ల పనితీరు పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతి నేరాల నియంత్రణ చర్యలను ఎస్పీ సమీక్షించారు.సీసీటీఎన్‌ఎస్ (2.0)ను సమర్థవంతంగా వినియోగించాలని ప్రతి కేసును సకాలంలో నమోదు చేసి దర్యాప్తు వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని సూచించారు. అందుబాటులో ఉన్న టూల్స్ ఫీచర్లను పూర్తిస్థాయిలో వినియోగించి పోలీసింగ్‌లో పారదర్శకత వేగం సేవల నాణ్యతను పెంచాలని ఆదేశించారు.సైబర్ మోసాలు ఆర్థిక నేరాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడంతో పాటు అక్రమ ఇసుక గంజాయి రవాణా పి డి యస్ రైస్ మట్కా జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.రోడ్డు ప్రమాదాల నివారణకు బ్లాక్ స్పాట్లను గుర్తించి సంబంధిత శాఖలతో సమన్వయంతో శాశ్వత నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కఠినంగా వ్యవహరించాలని ట్రాఫిక్ నిర్వహణను మరింత మెరుగుపరచాలని ఆదేశించారు.డయల్ 100 స్థానంలో కొత్తగా లాంచ్ చేసినటువంటి డయల్ 112 అత్యవసర సేవలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని సూచిస్తూ అత్యవసర సమయంలో పోలీస్ అంబులెన్స్, ఫైర్ సేవలను వేగంగా పొందేందుకు డయల్112 ను వినియోగించుకునేలా ప్రజలకు తెలియజేయాలని అన్నారు.ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో సీసీ కెమెరాల వ్యవస్థను విస్తరించి, అవి నిరంతరం పనిచేసేలా పర్యవేక్షించాలని తెలిపారు. సీసీ కెమెరాల వినియోగం ద్వారా ప్రాపర్టీ నేరాల నియంత్రణతో పాటు నేరాల ఛేదన మరింత సులభతరం అవుతుందని పేర్కొన్నారు.గ్రామస్థాయి పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేయాలని, విలేజ్ పోలీస్ అధికారులు తరచూ గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలతో మమేకమై సామాజిక సమస్యలను గుర్తించడంతో పాటు ముందస్తు సమాచార సేకరణకు ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్పీ గారు ఆదేశించారు.ఈ సమావేశంలో అదనపు ఎస్పీ కె. శంకర్ గారు, సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్సైలు, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.
పి.ఆర్.ఓ.జిల్లా పోలీస్ కార్యాలయం,జోగుళాంబ గద్వాల జిల్లా.

🌐 Select Language:
📰 ePaper