భీమనపల్లి గ్రామంలో ఇంటింటికీ తెలుగుదేశం రెండేళ్లలో అభివృద్ధి–సంక్షేమాన్ని ప్రజలకు వివరించినటీడీపీ శ్రేణులు

August 12, 2026 | ఆంధ్రప్రదేశ్

జనం న్యూస్ ఆగస్టు 12: ముమ్మిడివరం ప్రతినిధి( గ్రంధి నానాజీ)డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని భీమనపల్లి గ్రామంలో బుధవారం తెలుగుదేశం పార్టీ బూత్ నంబర్ 190 పరిధిలో “ఇంటింటికీ తెలుగుదేశం” కార్యక్రమాన్ని ఆత్మీయంగా నిర్వహించారు. యూనిట్ ఇన్‌చార్జి, ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కంకటాల రామం ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.ఈ సందర్భంగా కంకటాల రామం మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధికి కొత్త దిశ ఏర్పడిందన్నారు. ప్రజల సంక్షేమం, మౌలిక వసతుల అభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల ప్రగతి, ఉపాధి అవకాశాల కల్పనతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. అమలాపురం శాసనసభ్యులు అయితా బత్తుల ఆనందరావు నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారని రామం అన్నారు. రెండేళ్ల నమ్మకానికి అభివృద్ధి తో పాటు సంక్షేమానికి. భరోసా ఇస్తూ ప్రజల ముంగిటకు ప్రభుత్వ ప్రగతిని ఇంటింటికి తీసుకు వెళ్ళడమే తెలుగుదేశం ఆశయమని ఆయన అన్నారు.“ఇంటింటికీ తెలుగుదేశం” కార్యక్రమం ద్వారా ప్రభుత్వం చేసిన పనులను ప్రజలకు వివరించడంతో పాటు వారి సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకోవడం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో చురుకుగా పనిచేస్తున్నాయని చెప్పారు.ఈ కార్యక్రమంలో భీమనపల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు మంచెం బుజ్జి, కో-యూనిట్ మరియు ఆత్మ డైరెక్టర్ శీలం విజయ కుమారి భాస్కరరావు, మాజీ ఎం.పీ.టీ.సీ, 187వ బూత్ కన్వీనర్ పెయ్యలతిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.

🌐 Select Language:
📰 ePaper