ఆషాడ అమావాస్యనాడు శాకంబరీ దేవిగా మావుళ్ళమ్మ అమ్మవారు
జనం న్యూస్ ఆగస్టు 12 ముమ్మిడివరం ప్రతినిధి (గ్రంధి నానాజీ)కాట్రేనికోన: ఆషాడ మాసం అమావాస్య సందర్భంగా కాట్రేనికోనలో వేంచేసి ఉన్న శ్రీ మావుళ్ళమ్మ తల్లి అమ్మవారు శాకంబరీ దేవిగా విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. వివిధ రకాల కూరగాయలతో, పూలమాలలతో అమ్మవారిని అలంకరించారు.ఆలయ ప్రధాన అర్చకులు ఆణివిళ్ళ ఫణికాంత్ శాస్త్రి, పవన్ కుమార్, తాతపూడి పండు, బాలా శ్రీనివాస్ ఆధ్వర్యంలో చిరంజీవి చెరుకు శివతేజ చేత తొలిగా విఘ్నేశ్వరుని పూజ, అమ్మవారికి అభిషేకం, శ్రీ సూక్త విధానంగా సహస్రనామ కుంకుమార్చన, ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం నీరాజనం, మంత్రపుష్పాలు, వేద స్వస్తి జరిపారు. ఈ సందర్భంగా మహిళలు సామూహికంగా లలితా సహస్ర పారాయణం చేశారుఆలయ ఆవరణలోని వినాయకుడు, షిరిడి సాయిబాబా విగ్రహాలకు కూడా కూరగాయలతో పూజలు నిర్వహించారు. తాతపూడి భవాని బ్రదర్స్ ఆధ్వర్యంలో మిఠాయి ప్రసాదం పంపిణీ చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో లోక సంరక్షణార్థం నవగ్రహ హోమం, మృత్యుంజయ హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి పూజా విధానాలను తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.