రైతుల సూచన మేరకే నిర్ణయాలు తాగు నీటికి ప్రాధాన్యత ఆలోచనలో ప్రభుత్వం మండల అధ్యక్షులు బుచ్చిరెడ్డి
జనం న్యూస్ ఆగస్టు 12 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం చలి వాగు ఆయకట్ట రైతులతో సమావేశం నిర్ణయించి రైతుల సూచన మీరకే నిర్ణయాలు జరుగుతాయని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దూదిపాల బుచ్చి రెడ్డి అన్నారు. మండలంలోని చలివాగు ప్రాజెక్టు తూము, నీటి మట్టాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి బుచ్చి రెడ్డి పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ రైతులు ప్రతిపక్ష నాయకుల కుట్రలో బలి కావద్దని, తాగునీటికి ప్రాధాన్యత అనంతరం సాగునీటి ఆలోచనలో ప్రభుత్వం ఉందని అన్నారు. ఎల్నీనో ప్రభావం ప్రపంచమంతా ఉంటే రేవంత్ రెడ్డి తెచ్చిన కరువు అని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి వ్యాఖ్యానించడం వారి అవివేకం అన్నారు. రైతులతో రాజకీయం చేయకుండా చిత్తశుద్ధి ఉంటే చలివాగు ప్రాజెక్ట్ ఆయకట్టులో వారికి ఉన్న సుమారు 50 ఎకరాలు సాగు చేయకుండా పేద రైతులకు నీరు పారే విధంగా క్రాప్ హాలిడే ప్రకటించుకోవాలని డిమాండ్ చేశారు. చలి వాగు గేట్లు తానే ఎత్తుతానని రాజ్యాంగ విరుద్ధంగా మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే కు ఆ హక్కు ఎక్కడిది అని ప్రశ్నించారు. మినిమం లెవెల్స్ మెయింటైన్ చేయాలని ఈమధ్య కాలంలో కాంగ్రెస్ నాయకులు ధర్నా చేస్తే ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సహకారంతో లిఫ్టింగ్ నిలిపివేయగా ప్రస్తుతం 14 ఫీట్ల నీరు ఉందని గుర్తు చేశారు. లేకుంటే ప్రాజెక్ట్ డేడ్ స్టోరేజ్ కి చేరేదని అన్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సంబంధిత అధికారులతో సమీక్షలు.నిర్వహిస్తున్నారని, పంటలు వేశాక నీరు అందకపోతే భారీగా నష్టం జరిగే అవకాశం ఉన్నందున రైతులను ఆరుతడి పంటల వైపు మళ్ళించాలని ప్రయత్నాలు చేయడం జరిగిందని అన్నారు. ఇప్పటికే పంటలు వేసిన రైతులకు సాగునీరు తప్పకుండా ఇస్తారని, కొంత ఆయకట్టు రైతులతో మాట్లాడి క్రాప్ హాలిడే ఇచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. ఇప్పటికే అనధికారికంగా సాగునీరు పారుతుందని తెలిపారు . రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చల్ల చక్రపాణి వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ మారేపల్లి రవీందర్ (బుజ్జిన్న) వివిధ గ్రామాల మాజీ సర్పంచ్ అబ్బు ప్రకాశ్ రెడ్డి చిట్టి రెడ్డి రాజిరెడ్డి నాయకులు చిందం రవి నిమ్మల రమేష్ వైనాల కుమారస్వామి సర్పంచ్ మారబోయిన ప్రభాకర్ మంద దీనా ప్రభాకర్ సతీష్ శివాజీ నాయకులు శ్రీనివాస్ శంకర్ బిక్షపతి కుమారస్వామి రావుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.