కూకట్‌పల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నూతన పోలీసు అధికారులకు ఘన సన్మానం

August 12, 2026 | తెలంగాణ

జనం న్యూస్, ఆగస్టు 12 | తెలంగాణ స్టేట్ ఇంచార్జ్: శ్రీనివాస్ రెడ్డి : కూకట్‌పల్లి: నూతనంగా కూకట్‌పల్లి సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన స్వామి గౌడ్, అడ్మిన్ సబ్‌ఇన్‌స్పెక్టర్ రవీందర్ రెడ్డి, సబ్‌ఇన్‌స్పెక్టర్ ప్రసన్నలను కూకట్‌పల్లి లయన్స్ క్లబ్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారికి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ కూకట్‌పల్లి ప్రాంతం రోజురోజుకూ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజల సమస్యల పరిష్కారంపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన పోలీసింగ్ అందించాలని కోరారు.ప్రజా సమస్యల పరిష్కారంలో పోలీసు శాఖకు తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని లయన్స్ క్లబ్ ప్రతినిధులు స్పష్టం చేశారు. పోలీసు అధికారులు, ప్రజా సంఘాలు సమన్వయంతో పనిచేస్తే కూకట్‌పల్లి ప్రాంతంలో మరింత మెరుగైన వాతావరణం నెలకొల్పవచ్చని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కూకట్‌పల్లి లయన్స్ క్లబ్ అధ్యక్షులు వెంకటరెడ్డి, సెక్రటరీ శ్రీనివాసరెడ్డితో పాటు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper