పాసు బుక్కులా! మాస్ బుక్కులా..?
రైతులపట్టాదారుపాస్‌పుస్తకాల్లో తప్పిదాలపై మండల కో ఆప్షన్ సభ్యులు కలీముల్లా ఖాన్ ఆగ్రహం
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా నందలూరుమండలంలోని రైతుల పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ.వాటిలో చోటు చేసుకున్న తప్పిదాలపై నందలూరు మండల కో-ఆప్షన్ సభ్యులు కలీముల్లా ఖాన్ తీవ్రస్థాయిలో మండి పడ్డారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రైతు సంక్షేమానికి అనేక కార్యక్రమాలు అమలు చేశామని, పట్టాదారు పాస్‌పుస్తకాల విష యంలోనూ నిర్దిష్ట ప్రణాళికతో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా రైతులకు పాస్ పుస్తకాలు అందజేశామని ఆయన పేర్కొన్నారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం నందలూరు మండలంలో రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ జరిగి చాలా రోజులు గడిచినా, వాటిలో ఉన్న తప్పి దాలను రెవెన్యూ అధికారులు, కూటమి ప్రజాప్రతినిధులు ఇప్పటివరకు గుర్తించక పోవడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు.పాస్‌పుస్తకాలు ఎలాంటి సవరణలు అవసరం లేకుండా, పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాతే ముద్రించారా? లేక మాస్‌గా ముద్రించి రైతుల చేతుల్లో పెట్టారా?”అంటూ కలీముల్లా ఖాన్ల్ సూటిగా ప్రశ్నించారు . ప్రభుత్వాలువస్తుంటాయి.పోతుంటాయి.కానీ ప్రజలకు, ముఖ్యంగా రైతులకు ఉప యోగపడే కార్య క్రమాలను ప్రజా ప్రతి నిధులుచిత్తశుద్ధితో అమలు చేయాల్సిన బాధ్యత ఉంద న్నారు. రీ-సర్వే పేరుతో నంద లూరు మండలంలోని రైతుల పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబించ డంతో పాటు అధికార దుర్వి నియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.దేశానికి వెన్నెముకైన రైతుల సమస్యలపై మండల స్థాయిలో నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసి, పాస్‌పుస్తకాలలో జరిగిన తప్పిదాలు, రీ-సర్వే ప్రక్రియలో చోటు చేసుకున్న లోపాలపై వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని ఆయన కోరారు.ఈ మేరకు తన విన్నపాన్ని మండల ఉన్నత స్థాయి రెవెన్యూ అధికారులతో పాటు జిల్లా కలెక్టర్ కు పంపు తున్నట్లు కలీముల్లా ఖాన్ తెలిపారు.ఈ కార్య క్రమంలో వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ నాయకులు గోదా నాగ భూషణం, వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు ముమ్మడి శెట్టి సుధాకర్, బీసీ నాయ కులు తుమ్మల శ్రీధర్ గౌడ్, మైనార్టీ సీనియర్ నాయకులు షాజహాన్ అజీజ్ తదితరులు పాల్గొన్నారు.