ఢిల్లీ నుంచి రాంచీ వరకు నేడు విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు రేపు దేశం మొత్తం ప్రశ్నిస్తుందా?

August 12, 2026 | తెలంగాణ

జనం న్యూస్ 12 ఆగస్టు 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ : మొన్న ఢిల్లీ నిన్న రాంచీ
రేపు మరో నగరం మరో రాష్ట్రం జార్ఖండ్‌ రాజధాని రాంచీలో వేలాది మంది విద్యార్థులు ఉద్యోగార్థులు ప్రభుత్వ నియామక పరీక్షల్లో అవకతవకలకు వ్యతిరేకంగా అసెంబ్లీ ముట్టడికి కదిలారు. ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేసిన విద్యార్థులను అడ్డుకునేందుకు పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. విద్యార్థులు ముందుకు సాగడంతో లాఠీచార్జ్‌ బాష్పవాయువు, వాటర్‌ కెనాన్లతో నిరసనను అణచివేసే ప్రయత్నం జరిగింది.కానీ లాఠీ దెబ్బలతో ఒక ప్రశ్నను ఆపగలరా మా భవిష్యత్తుకు న్యాయం ఎక్కడ ఇది రాంచీ విద్యార్థుల ప్రశ్న మాత్రమే కాదు.కొద్ది వారాల క్రితం ఢిల్లీలో సి జై పి నాయకత్వంలో జంతర్‌మంతర్‌ వద్ద జరిగిన విద్యార్థి ఉద్యమం కేంద్ర ప్రభుత్వ విద్యా విధానాలు పరీక్షలలో అవకతవకలు, పేపర్‌ లీకులపై తీవ్ర ఒత్తిడి తెచ్చింది. 49 రోజుల పాటు సాగిన ఆ ఉద్యమం చివరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాకు, కొన్ని ఇతర డిమాండ్లపై ప్రభుత్వ హామీలకు దారితీసింది.అది ఒక ముఖ్యమైన రాజకీయ సందేశం. సంఘటిత ప్రజా ఒత్తిడి అధికారాన్ని జవాబుదారీగా నిలబెట్టగలదు.అందుకే ఢిల్లీ తర్వాత రాంచీని కేవలం మరో విద్యార్థి ఆందోళనగా చూడకూడదు. ఒక చోట పరీక్షల అవకతవకలుమరోచోట ఉద్యోగాల కొరతఇంకోచోట భూమి సమస్యమరోచోట కార్మికుల శ్రమ దోపిడీఎక్కడో రైతుల సమస్యలుమరెక్కడో విద్యార్థులపై అన్యాయం.ఇంకొకచోట ప్రజాస్వామిక హక్కులపై ఆంక్షలు. ప్రశ్నలు వేరు కావచ్చు.కానీ అసంతృప్తి పెరుగుతున్నది.అన్యాయం అణచివేత అవినీతి నిరుద్యోగం శ్రమ దోపిడీ, ప్రజా వ్యతిరేక విధానాలు విద్యార్థి వ్యతిరేక విధానాలు ఎదురైనప్పుడు ప్రజలు ఇక మౌనంగా ఉండకూడదనే భావన బలపడుతోంది. ఇక్కడే అసలు ప్రశ్న ముందుకు వస్తుంది.ఏ ప్రభుత్వం అయినా ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచి అవినీతికి పాల్పడి నిరంకుశంగా వ్యవహరించి ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తే ప్రజలకు ప్రత్యామ్నాయం ఏమిటి ప్రతి ఎన్నికలో ఒక పార్టీని ఓడించి మరో పార్టీని అధికారంలోకి తీసుకురావడమే ప్రత్యామ్నాయమా లేక ప్రజలే తమ సమస్యలపై సంఘటితమై ఉద్యమాలను నిర్మించి అధికారాన్ని ప్రశ్నించి ప్రభుత్వాలను జవాబుదారీగా నిలబెట్టి తమ హక్కుల కోసం నిరంతరం పోరాడటమే అసలైన ప్రజాస్వామ్య ప్రత్యామ్నాయమా రాంచీలో విద్యార్థులు అసెంబ్లీని ముట్టడించారు వారిని లాఠీలతో చెదరగొట్టవచ్చుబాష్పవాయువుతో వెనక్కి పంపవచ్చు.కేసులు పెట్టవచ్చు.కానీ విద్యార్థుల అసంతృప్తిని అణచగలరా ప్రజల ప్రశ్నలను అణచగలరా అన్యాయానికి వ్యతిరేకంగా పెరుగుతున్న చైతన్యాన్ని అణచగలరాఢిల్లీ ఒక సందేశం ఇచ్చింది.సంఘటిత ఉద్యమం అధికారాన్ని ఒత్తిడికి గురిచేయగలదు.రాంచీ మరో సందేశం ఇస్తోంది. ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా బలప్రయోగం చేస్తే అసంతృప్తి మరింత విస్తరించవచ్చు.మొన్న ఢిల్లీ.నిన్న రాంచీ.రేపు మరో నగరం.ఆ తర్వాత మరో రాష్ట్రం.ఇది కేవలం విద్యార్థుల ప్రశ్నగా మిగిలిపోతుందా లేక అన్యాయానికి అవినీతికి అణచివేతకు నిరుద్యోగానికి శ్రమ దోపిడీకి, ప్రజా వ్యతిరేక విధానాలకు గురవుతున్న కోట్లాది ప్రజల ప్రశ్నగా మారుతుందా ఆ ప్రశ్నకు సమాధానం కాలమే చెబుతుంది.కానీ ప్రశ్నించడం మాత్రం ఇప్పుడే మొదలైంది.

🌐 Select Language:
📰 ePaper