చలివాగు నీటిని విడుదల చేయాలి,
పంటలను.ఆదుకోవాలి .మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి
జనం న్యూస్ ఆగస్టు 12 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం లోని , జోగంపల్లి గ్రామంలోని చలివాగు ప్రాజెక్ట్ పంపుహౌస్ లను సందర్శించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అనంతరం ఆయన మాట్లాడుతూచలివాగు ప్రాజెక్ట్ తూములు లేపి నీళ్లు వదిలి, ఆయకట్టు ప్రాంత పంట పొలాలకు నీళ్లు ఇయ్యాలని తెలిపారు దాదాపుగా మేము 15, 20 రోజుల నుంచిఅడుగుతున్న ఈ ప్రభుత్వానికి చలనం లేదు. చీమ కుట్టినట్టు కూడా అయితలేదు. ఇక్కడి నుంచి మోటార్ల వేసి పైకి నీళ్లు తీసుకుపోతున్నారు, మా పంట పొలాలకు నీళ్లు ఇస్తలేరు కాబట్టి మా రైతులందరూ కూడా తీవ్రమైనట్టువంటి మనోవేదనలో ఉన్నారు.రైతన్నలు నార్లు పోసి 45 రోజులు అయ్యింది, నార్లు పెరిగి ఉన్నాయి.నీళ్లు ఇస్తే నాటేసుకోవాలి. కానీ ఈ ప్రభుత్వం నీళ్లు ఇవ్వకుండా కాలయపన చేస్తున్నారని మండిపడ్డారు చివరిగా ప్రభుత్వానికి హెచ్చరిక చేయడం కొరకు రోడ్డుపై రాస్తారోకో చేశాం.ఇది ఇంతటితో ఆగదు. తక్షణమే గనక స్థానిక శాసన సభ్యుడు 24 గంటల లోపు నీళ్లు గనక వదలకపోతే, ఎమ్మెల్యే గ్రామాలకు వస్తే నిలదీస్తాం, ఎక్కడికక్కడ నడవకుండా చేస్తాం అని రైతులు హెచ్చరిక చేస్తున్నారు కాబట్టి, వాళ్ళ డిమాండ్ ప్రకారం తక్షణమే నీళ్లు ఇయ్యాలి, పంట పొలాలకు నీళ్లు ఇచ్చి రైతులను ఆదుకోవాలి.ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే,ఖచ్చితంగా 9 పంపులను ఆన్ చేయాలి,9 పంపులు నడిపియ్యాలి,పంట పొలాలకు నీళ్లు ఇయ్యాలి, అని కోరుకుంటున్నాం..కానీ ప్రస్తుతం 5 లేదా 6 పంపులు మాత్రమే నడుస్తున్నాయి, ఎందుకు అంటే రిపేర్ అని ఒకసారి, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం అని కారణాలు చెప్తున్నారు.9 పంపులు నడిస్తే నెలకు 6 టీఎంసిల నీళ్లు పంపింగ్ అవుతాయి అంటే 6 నెలలకు 36 టీఎంసిలు నీళ్ళు పంపింగు జరిగితే గనక ఎక్కడ కూడా పంట పొలం ఎండదు, తాగునీటి సమస్య రాదు.కాబట్టి ఇవన్నీ కూడా చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.చేయకపోతే రాస్తారోకో తో ఆగదు. ప్రభుత్వం దిగి వచ్చే వరకు మా కార్యక్రమం ఉంటది. రైతు ఏడిచిన రాజ్యం, ఎద్దు ఏడ్చిన ముందు పడదు. ఇప్పటికే రైతులు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదు, రేవంత్ రెడ్డి తెచ్చిన కరువు అని ఏద్దేవా చేశారు . సరియైనటువంటి విధానాలు అవలంబించి, పంపులు ఆన్ చేయాలి అని డిమాండ్ చేస్తూ రాస్తారోకో నిర్వహించారు అనంతరం బైక్ పై ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మెతుకు తిరుపతి రెడ్డి మాజీ జేడ్పిటీసి నారాయణ రెడ్డి గోవిందా పురం గ్రామ సర్పంచ్. దాసి స్వాతి శ్రావణ్ కుమార్ కొప్పుల గ్రామ సర్పంచ్ మామిడి అశోక్ బి ఆర్ ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…