మహిళా సంఘాల సభ్యురాళ్ళతో, సర్పంచ్ సమావేశం.

August 12, 2026 | తెలంగాణ

జనం న్యూస్, 12, ఆగస్టు, కొల్లూరు గ్రామం, ఝరాసంగం మండలం, సంగారెడ్డి జిల్లా .( జహీరాబాద్ నియోజకవర్గం ప్రతినిధి, చింతలగట్టు నర్సిములు )సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గం, ఝరాసంగం మండల పరిధిలోని, కొల్లూరు గ్రామపంచాయతీ కార్యాలయంలో, స్వయం సహాయక సంఘాల సభ్యురాళ్ళతో ,( వి. ఓ. ఏ ) చింతలగట్టు మరియమ్మ, ( వి. ఓ ) సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి, కొల్లూరు గ్రామ సర్పంచ్, చింతలగట్టు శివరాజ్, ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మైక్రో ఫైనాన్స్ లో అధిక వడ్డీకి అప్పు తీసుకోకూడదని, బ్యాంకుల ద్వారానే ఋణాలు తీసుకోవాలని, ప్రభూత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, తెలిపారు. అదేవిధంగా, ( వి. ఓ. ఏ ) చింతలగట్టు మరియమ్మ మాట్లాడుతూ, సంఘాలలోని సభ్యురాళ్ళు అందరూ,( కేవైసీ ) చేసుకోవాలని ఆమె తెలిపారు.

🌐 Select Language:
📰 ePaper