శ్రీ భోగలింగేశ్వర దేవస్థానంలో ఏకాదశి రుద్రాభిషేకం- చైర్మన్ కాండ్రేగుల సత్యనారాయణ

August 12, 2026 | ఆంధ్రప్రదేశ్

జనం న్యూస్ ఆగస్టు 12 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ స్వయంభు శ్రీ భోగ లింగేశ్వర స్వామి వారికి ఆషాడ మాస శివరాత్రి శుభ సందర్భంగా ప్రదోషకాల మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం అత్యద్భుతంగా నిర్వహించారని దేవస్థానం చైర్మన్ కాండ్రేగుల సత్యనారాయణ (SFI) అర్చకులు చిన్నస్వామి పర్యవేక్షణలో భక్తులకు అన్ని సదుపాయాలు ఏర్పాట్లు చేశారు. శ్రీ స్వామివారిని ప్రత్యేకంగా ఆదిశేషుని అలంకరణలో దర్శనo ఇచ్చారని, ముందుగా గోపూజ, గణపతి అర్చన, భక్తులచే నందీశ్వరునికి అభిషేకం, మహన్యాస పూర్వక రుద్రాభిషేకం అమ్మవారి కుంకుమార్చన, దీపాలంకరణ సేవ, ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు పేరూరి చిన్ని స్వామి, సాత్విక్ శర్మ, అయ్యప్ప, ఏడిద నాగేంద్ర శర్మ పండితులచే శైవాగమ ప్రవచన పూర్వకంగా నిర్వహించారని దేవాలయం చైర్మన్ కాండ్రేగుల సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మ కర్తల మండలి సభ్యులు మరియు కార్యనిర్వాహణాధికారి పాల్గొన్నారు..//

🌐 Select Language:
📰 ePaper