సోయాబీన్, మినుము, కంది పంటల పరిశీలన
జుక్కల్ ఆగస్టు 13 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం చిన్న ఎడ్గి గ్రామంలో గ్రామ సభలో వ్యవసాయ విస్తరణ అధికారి సతీష్ చిద్రవార్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఫ్రేమ్ వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్ అనే యాప్ పైన,నీటి కుంటలు, ఆయిల్ పామ్ పంటల పైన రైతు సోదరులకు వివరించడం జరిగింది. తరువాత క్షేత్ర స్థాయిలో సోయాబీన్ , ప్రత్తి పంటలను పరిశీలించి రైతు సోదరులకు తగు సలహాలు,సూచనలు ఇవ్వడం జరిగింది. ప్రత్తి పంటలో రసం పీల్చే పురుగులు అయిన తెల్ల దోమ,పచ్చ దోమ, పెనుబంక,తామర పురుగు ఉదృతి గమనించి దాని నివారణకు వేప నూనె (1500ppm) 500ml ఎకరాకు + ఫిప్రోనిల్ 200ml ఎకరాకు లేదా డైఫెంథియురాన్ 200 గ్రాములు 200లీటరు ల నీటిలో కలిపి పిచికారి చేయాలని సూచించడం జరిగింది.సోయాబీన్ పంటలో ప్రధానంగా పచ్చ పురుగు, కాండపు పురుగు ( Stem girdle) గమనించి దాని నివారణకు ఏమమెక్టిన్ బెంజోయేట్ ( EM 1) 100 గ్రాములు ఎకరాకు ఉదృతి ఎక్కువగా ఉన్నపుడు ఫ్లుబెండిమిడ్ ( Takumi) 100గ్రాములు ఎకరాకు +13.0.45@1kg ఎకరాకు పిచికారి చేయాలని సూచించడం జరిగింది. ఆకుమచ్చ తెగులు నివారణకు Mancozeb & Carbendizum (Saaf) 400గ్రాములు ఎకరాకు లేదా Propiconazole ( టిల్ట్) 200ml ఎకరాకు 200 లీటరు ల నీటిలో కలిపి పిచికారి చేయాలని సూచించడం జరిగింది.కంది పంటలో ప్రధానంగా ఎండు తెగులు గమనించి దాని నివారకు కాపర్ ఆక్స్ క్లోరైడ్ COC 3 గ్రాములు లీటరు నీటికి అనగా 600 గ్రాములు ఎకరాకు + 13.0.45@ 1kg ఎకరాకు కలిపి పిచికారి చేయాలని సూచించడం జరిగింది. ఈరోజు క్షేత్ర స్థాయి సందర్శనలో రైతు సోదరులు సుర్నార్ శివాజీ పటేల్, కోసంబె వెంకట్ పటేల్ పాల్గొనడం జరిగింది.