అయిజ లో భారీగా తిరంగా బైక్ ర్యాలీ
జనం న్యూస్ 13 ఆగస్టు 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ : బిజెపి అయిజ పట్టణ అధ్యక్షులు తెలుగు నరసింహ ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సబ్యులు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ మన్య ప్రధాని నరేద్రమోడీ జీ పిలుపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఆదేశాల మరియు ఎంపీ డికే అరుణమ్మ సూచన మేరకుతిరంగా బైక్ ర్యాలీ హర్ ఘర్ అభియాన్లో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణ పుర వీదులగుండ జాతీయ పతాకాలతో బైక్ ర్యాలీ నిర్వహించామనిఈ ఏడాది హర్ ఘర్ తిరంగా అభియాన్ను వందేమాతరం 150వ వార్షికోత్సవానికి అంకితం చేయడం ఎంతో విశేషం భారతదేశ ఆత్మను ఎల్లప్పుడూ ఐక్యంగా నిలిపిన దేశభక్తి స్ఫూర్తిని మరింత బలోపేతం చేసుకోవడానికి ఈ సందర్భం మనందరికీ ప్రేరణనిస్తుందిత్రివర్ణ పతాకం సగర్వంగా రెపరెపలాడాలా భారత్ ప్రగతి పథంలో నిరంతరం ముందుకు సాగాలి ఈ స్వాతంత్ర్య దినోత్సవం రోజున మన దేశభక్తిని ప్రతి ఇంటిలోనూ నింపుదాం మీ నివాసాలపై నేడు,రేపు మరియు యల్లుండి మువ్వన్నెల జెండాను ఎగురవేసి వందేమాతరం గీతంతో కలసి జాతీయ జెండాతో ఒక సెల్ఫీ తీసుకోండి. ఆ ఫోటోను లో అప్లోడ్ చేసి ఉద్యమంలో భాగస్వాములవ్వండి.మన భారతావని ఐక్యతను అపారమైన గర్వాన్ని కలసికట్టుగా చాటిచెబుదాం అని అన్నారు ఈ కార్యక్రమం లో బీజేపీ నాయకులు కంపాటి భగత్ రెడ్డి లక్ష్మణ్ గౌడ్ తూముకుంట అంజి,బెల్లంకొండ నాగరాజు రాజశేఖర్ భీమన్న,ప్రతిప్ నరసింహరఘు బోయవెంకటేష్ లక్ష్మణ్ చారి నాగిరెడ్డిశ్రీకాంత్ వర్మ చారి జై సింహ సాయి అశ్విన్ వినయ్ తదితరులు పాలుగొన్నారు