ఘనంగా పుచ్చల పల్లి సుందరయ్య వర్ధంతి
జనం న్యూస్: మే 19 నిడమనూరు నల్లగొండ ప్రతినిధి బొంగరాల శ్రీనివాస్*దక్షిణ భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, ఆదర్శ నాయకులు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతిని నిడమనూరు మండల కేంద్రంలో సిపిఎం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా *సిపిఎం జిల్లా కమిటీ సభ్యులకు కొండేటి శ్రీను మండల కార్యదర్శి కందుకూరు కోటేష్* మాట్లాడుతూ ఆదర్శవంతమైన విలువలతో రాజకీయాలు చేయడం కమ్యూనిస్టులకే సాధ్యమని దీనికి సుందరయ్య గారి జీవితమే ఆదర్శమని అన్నారు. భూస్వామ్య కుటుంబంలో పుట్టినప్పటికీ భూస్వామ్య పెత్తందారి విధానాలకు వ్యతిరేకంగా చిన్ననాటి నుండే పోరాటం చేసిన మహా నాయకుడిని అన్నారు. తెలంగాణలో భూస్వామ్య జమీందారీ రజాకార్లకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటం సాగించడంలో కీలకపాత్ర వహించారని, వ్యవసాయ కార్మికులకు కూలీ పెరగాలని, భూమి పంచాలని సంఘం సంఘం పెట్టి కూలి భూమి పోరాటాలు చేశారని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో *సిపిఎం మండల కమిటీ సభ్యులు కోమండ్ల గురువయ్య, నల్లబోతు సోమయ్య, మల్లికంటి చంద్రశేఖర్, ఆకారపు నరేష్, వెంపటి మహేష్, ఇంజమూరి శివ, కొంచెం శేఖర్, ముత్యాల కేశవులు, కోదండ చరణ్ రాజు, గుప్త శ్రీనివాస్ రెడ్డి,నడ్డి నాగరాజు, బొడ్డు లింగయ్య, వెంకటమ్మ సాంబయ్య మేరమ్మ*, తదితరులు పాల్గొన్నారు