పెంచిన పెట్రోల్ డీజిల్ రేట్లను వెంటనే తగ్గించాలి. సీపీఎం
జనం న్యూస్: మే 19 నిడమనూరు నల్లగొండ ప్రతినిధి బొంగరాల శ్రీనివాస్* పేద ప్రజలపై భారాలు మోపే పెట్రోల్ డీజిల్ రేట్లను వెంటనే తగ్గించాలని *సిపిఎం జిల్లా కమిటీ సభ్యులకు మండల కార్యదర్శి కందుకూరి కోటేశ్* లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం నిడమనూరు మండల కేంద్రంలో పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలకు నిరసనగా ఆటో లాగుతూ నిరసన తెలియజేశారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నింటి ధరలను విపరీతంగా పెంచి పేద ప్రజలపై భారతం అవుతుందని, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్ వ్యక్తులకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు చేస్తున్నారని అన్నారు.గ్యాస్ కొరత ప్రజలను వేధిస్తుంటే, అన్నీ ధర లను పెంచి, ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పి ప్రభుత్వం క్రమంగా పరిపాలనా బాధ్యతలను వదిలేసి, పార్టీని పెంచుకోవడంలోనే దృష్టి పెట్టిందని అన్నారు. పాలన చేతకాక దేశ ప్రజలకు పొదుపు సూక్తులు వల్లిస్తున్నారని అన్నారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించకపోతే దేశ ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో *సిపిఎం మండల కమిటీ సభ్యులు కోమాండ్ల గురువయ్య, నల్లబోతు సోమయ్య, ఆకారపు నరేష్, మలికంటి చంద్రశేఖర్, వెంపటి మహేష్, కొంచెం శేఖర్, కోదండ చరణ్ రాజ్, వింజమూరి శివ, బొడ్డు లింగయ్య, గుప్త శ్రీనివాస్ రెడ్డి, నడ్డి నాగరాజు, వెంకటమ్మ, సాంబయ్య, మేరమ్మ*, తదితరులు పాల్గొన్నారు