సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణి కార్యక్రమంలో పాల్గొన్న కొండాపురం గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు

May 19, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ 19 మే 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా కేటి దొడ్డి మండల పరిధిలోని కొండాపురం గ్రామానికి చెందిన వడ్డే రాజు కు 14000 రూపాయల వెంకటాపురం స్వామి కు 35000రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ (సీఎంఆర్ఎఫ్) చెక్కులను సరితమ్మ క్యాంపు కార్యాలయం నందు తెలంగాణ రాష్ట్ర షీప్స్ అండ్ గోట్స్ అభివృద్ధి సహకార సమాఖ్య చైర్‌పర్సన్, గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ సరిత తిరుపతయ్య కొండాపురం గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులతో కలిసి పంపిణీ చేశారు ఈ సందర్భంగా సరిత తిరుపతయ్య మాట్లాడుతూ పేద ప్రజల ఆరోగ్యం సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తోందని తెలిపారు నిరుపేద కుటుంబాలు కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకుని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని పేర్కొన్నారు అలాగే గద్వాల నియోజకవర్గంలోని అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా నిరంతరం కృషి చేస్తామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో కొండాపురం మాజీ సర్పంచ్ మహానంది రెడ్డి మాజీ ఎంపీటీసీ పద్మ రెడ్డి పాతపాలెం ఆనంద్ గౌడ్ చాకలి నరేష్ వడ్డే వెంకట్ రాములు వడ్డే రాజు తటుకుంట రవి కొత్తపల్లి సర్పంచ్ రాజశేఖర్ రెడ్డి గోను పాడు సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper