కోనసీమ సమగ్ర అభివృద్ధే లక్ష్యంప్రత్యేక నిధులు, సాగునీటి కాలువల ఆధునీకరణకు ప్రాధాన్యంమంత్రి వాసంశెట్టి సుభాష్
జనం న్యూస్ ఆగస్టు 15 ముమ్మడివరం ప్రతినిధి( గ్రంధి నానాజీ)డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా సమగ్ర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, భవిష్యత్ కార్యాచరణపై జిల్లా ఎమ్మెల్యేల ఆత్మీయ సమావేశం అమలాపురంలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో జరిగింది. కోనసీమ జిల్లాకు ప్రత్యేకంగా నిధులు కేటాయించి, ప్రాంతీయ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని సమావేశం తీర్మానించింది.ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ కోనసీమ అభివృద్ధి మనందరి ఉమ్మడి బాధ్యత. ప్రజల అవసరాలను గుర్తించి, ప్రతి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే మన లక్ష్యం అని అన్నారు. నెలకోసారి ఒక ఎమ్మెల్యే గృహంలో ఆత్మీయంగా సమావేశమై, నియోజకవర్గాల వారీగా ప్రజా సమస్యలు, అభివృద్ధి పనులు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలు, భవిష్యత్ కార్యాచరణపై సమీక్షించటం శుభ పరిణామమని మంత్రి తెలిపారు.గోదావరి నదీ పరివాహక ప్రాంతమైన కోనసీమలోని చెరువులు, పంట కాలువలు, సాగునీటి వనరుల్లో పెద్దఎత్తున పూడిక పేరుకుపోవడంతో సాగునీటి సరఫరాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని సమావేశం గుర్తించింది. గత వైసీపీ ప్రభుత్వం పంట కాలువలపై అభివృద్ధి పనులు చేపట్టలేదని విమర్శించారు. ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన కాకుండా కోనసీమకు ప్రత్యేకంగా నిధులు కేటాయించి చెరువులు, పంట కాలువల్లో పూడికతీత పనులు చేపట్టాలని తీర్మానించారు. దీంతో పంట కాలువల్లో నీటి ప్రవాహం మెరుగుపడి, రైతులకు సాగునీటి ఇబ్బందులు తగ్గుతాయని సమావేశం అభిప్రాయపడింది. ఈ తీర్మానాలను పార్టీ అధిష్టానానికి పంపుతామన్నారు.గన్నవరానికి సింగిల్ ఇన్‌చార్జి నియామకంపై తీర్మానంగన్నవరం నియోజకవర్గంలో ప్రస్తుతం కొనసాగుతున్న టూ మెన్ కమిటీ స్థానంలో ఒకే సింగిల్ ఇన్‌చార్జిని నియమించాలని సమావేశంలో కీలకంగా చర్చించి తీర్మానించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీని మరింత బలోపేతం చేయడానికి, నాయకులు–కార్యకర్తలను సమన్వయం చేసేందుకు సింగిల్ ఇన్‌చార్జి వ్యవస్థ మరింత ప్రయోజనకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.ఇంటింటి ప్రచార కార్యక్రమంలో ప్రజల నుంచి వస్తున్న ఇళ్ల స్థలాలు, కొత్త పింఛన్లు, ఇతర సంక్షేమ పథకాలకు సంబంధించిన వినతులను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సమావేశం నిర్ణయించింది. ప్రజలు మన దగ్గరకు వచ్చే వరకు వేచి చూడకుండా.. మనమే ప్రజల వద్దకు వెళ్లాలి. ఇంటింటికీ వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారం చూపించాలి. ప్రజల విశ్వాసమే మన బలం అని అన్నారు.భవిష్యత్ అభివృద్ధిపై సమగ్ర కార్యాచరణడాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రహదారులు, సాగునీరు, డ్రైనేజీ, పారిశుధ్యం, విద్య, వైద్యం, ఉపాధి, మౌలిక వసతుల అభివృద్ధిపై భవిష్యత్‌లో చేపట్టాల్సిన కార్యక్రమాలను సమావేశంలో చర్చించారు. ప్రతి నియోజకవర్గానికి అవసరమైన ప్రాధాన్యతా పనుల జాబితాను రూపొందించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. కోనసీమను అభివృద్ధికి ఆదర్శంగా నిలపాలి. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రధాన లక్ష్యం. అభివృద్ధి విషయంలో అందరం ఒకే మాటపై ముందుకు సాగాలని మంత్రి సుభాష్ పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు అయితాబత్తుల ఆనందరావు, వేగుళ్ల జోగేశ్వరరావు, బండారు సత్యానందరావు, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా టీడీపీ అధ్యక్షులు గుత్తుల సాయి, జిల్లా ప్రధాన కార్యదర్శి గంధం పళ్లం రాజు, రాజోలు నియోజకవర్గ ఇన్‌చార్జి గొల్లపల్లి అమూల్య, గన్నవరం టూ మెన్ కమిటీ సభ్యులు మోకా ఆనందసాగర్, దాసరి వీర వెంకట సత్యనారాయణ, అముడా చైర్మన్ అల్లాడి స్వామినాయుడు తదితరులు పాల్గొన్నారు.