ఉత్తమ ఎంపీడీవోగా కేఆర్ఎం.ప్రసాద్ కలెక్టర్ చేతులమీదుగా ప్రశంసా పత్రం
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా (ఆగస్టు 17) 80 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా విశిష్ట సేవలకు గుర్తింపుగా నందలూరు ఎంపీడీవో KRM ప్రసాద్, కడప జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా పురస్కారంఅందుకున్నారు. అదేవిధంగా డిప్యూటీ ఎంపీడీవో పద్మజ ,స్వర్ణ గ్రామం అధికారి కార్యాలయంలో పనిచేయు చున్న టైపిస్ట్ షణ్ముఖ సాయి చేసిన సేవలకు గుర్తింపుగా మెరిట్.సర్టిఫికేట్ అందుకు న్నారు,భవిష్యత్తులో కూడా ఇదే అంకితభావంతో మరింత మెరుగైన సేవలు అందించి మరెన్నో పురస్కారాలు పొందాలనికోరుకుంటూ పి. హబీబుల్లాఖాన్,పరిపాలన అధికారి,మండల ప్రజా పరిషత్ నందలూరు మండల ప్రజా పరిషత్ సిబ్బంది అభినందనలు తెలిపారు.