ఘనంగా సర్దార్ సర్వాయిపాపన్న గౌడ్ జయంతి.
జనం న్యూస్ : వనపర్తి డివిజన్ రీపోటర్ కటికల శివకుమార్ వనపర్తి జిల్లా పెబ్బేరు ఆగస్టు 18-08-2026 మంగళవారం పట్టణంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలు మంగళవారం సుభాష్ చౌరస్తాలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పెబ్బేరు మున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్ పాల్గొని, పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు._ ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ. బహుజనుల ఆత్మగౌరవం, సామాజిక న్యాయం కోసం పోరాడిన మహోన్నత యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని కొనియాడారు. ఆయన చూపిన బాటలో ప్రతి ఒక్కరూ పయనిస్తూ సామాజిక సమానత్వానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు మాచర్ల శ్రీనివాస్ గౌడ్, పబ్బ శేఖర్ గౌడ్, మాజీ సర్పంచ్ సురేందర్ గౌడ్ రంగస్వామి గౌడ్ శివశంకర్ గౌడ్, ఎన్ ఆర్ జి,డైరెక్టర్ రామన్ గౌడు, బసవరాజ్ గౌడ్ కమలాపురం వెంకటయ్య గౌడ్, సర్వయ్య గౌడు, వెంకటయ్య గౌడ్, ప్రభాకర్ గౌడ్, నరసింహ గౌడ్, బాలరాజ్ గౌడ్, రమేష్ గౌడు, ఉమేష్ గౌడ్, రాజా గౌడ్, గిరిజ గౌడు, జనార్దన్ గౌడ్, మోహన్ గౌడ్, ప్రవీణ్ గౌడ్, మణిదీప్ గౌడ్, నర్సం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.End