పెంచిన డీజిల్, పెట్రోల్, ఎరువుల ధరలను తక్షణమే తగ్గించాలి

May 20, 2026 | తెలంగాణ

జనం న్యూస్ 20 మే 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ రైతుల పట్ల, మధ్యతరగతి కుటుంబాల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి మారాలి కొండాపురం బి ఆర్ యస్ నాయకులు గాజుల కృష్ణ రెడ్డి కావిలి గోపి, గోనెల స్వామి, యుగంధర్ నాయుడు జోగులాంబ గద్వాల జిల్లా కేటీ దొడ్డి మండలం, కొండాపురం ప్రధాన రహదారిపై కాళీ ఎరువుల బస్తాలు గ్యాస్ స్టవ్ తో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు పెంచిన పెట్రోల్, డీజిల్, రైతుల ఎరువుల ధరలు వెంటనే తగ్గించాలని ఖరీఫ్ సీజన్‌లో వ్యవసాయానికి అవసరమైన డి ఏపి యూరియా కాంప్లెక్స్ రకాల ఎరువులను కొరత లేకుండా సరఫరా చేయాలి ఎరువుల బ్లాక్ మార్కెట్‌ను అరికట్టాలి డిమాండ్ యుద్దం సాకు చూపి ఎరువుల కంపెనీలు ఎరువుల ధరలు పెంచి అన్నదాతల నడ్డి విరుస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఇరాన్- అమెరికా ఇజ్రాయిల్ ల యుద్దం ప్రభావంతో ఉత్పత్తి ఖర్చులు పెరిగితే కేంద్ర ప్రభుత్వం ఎరువులపై సబ్సిడీ ఇవ్వాలి తప్ప ధరలు పెంచడానికి అనుమతినివ్వడం రైతులను నిలువునా ముంచడమే తప్ప ఇంకొకటి కాదన్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు బోనస్ హామీలు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు భరోసా రాక పెట్టుబడి పెట్టలేక అప్పులపాలవుతున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చీమకుట్టినైన స్పర్శ లేదని విమర్శించారు ప్రభుత్వ సహకార ప్రవేట్ రంగాలలోని కంపెనీలు ఎరువుల ధరలు పెంచకుండా కేంద్రం చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ఆయిల్ కంపెనీలు పెట్రోల్ డీజిల్ ధరలను లీటరుకు మూడు రూపాయలపైన పెంచాయని, మరోసారి దశల వారి పది రూపాయల వరకు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు ఖరీఫ్ సీజన్ ప్రారంభం అవుతున్న ఈ సీజన్లో ఇప్పుడు ఎరువుల ధరలు పెరగడం వల్ల రైతును వ్యవసాయం నుండి బేధఖల్ చేయడమే అని అన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం అవుతుండగానే ఎరువుల ధరలు పెంచడం రైతాంగానికి మోయలేని భారమవుతుందన్నారు. ఒక్కో బస్తాకు రూ.125 నుండి 300లు పెంపుదల వలన రాష్ట్ర రైతాంగంపై రూ.800 కోట్ల భారం పడనున్నదని విచారం వ్యక్తం చేశారు ఎరువుల దుకాణాల వ్యాపారులు ఇష్టారాజ్యంగా ఎరువుల ధరలు పెంచకుండా, బ్లాక్ మార్కెట్‌కు తరలించకుండా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అవసరమైతే ఎరువుల సబ్సిడీని పెంచి, ఎరువుల ధరలు పెరగకుండా చూడాలని వారు కోరారు

🌐 Select Language:
📰 ePaper