ఐదేళ్ల ప్రజల జేబులో ఖాళీ చేసి ఇప్పుడు వైసిపి డ్రామాలు : ఎద్దుల విజయ సాగర్
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా 20-05-26పెట్రోల్, డీజిల్ ధరలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న ధర్నాలు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుందని, ఇదంతా ఒక పెద్ద డ్రామా అని రాజంపేట అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎద్దుల విజయసాగర్ తీవ్రంగా విమర్శించారు పత్రికా విలేకరులకు తెలియజేస్తూ సమావేశంలో ఆయన మాట్లా డుతూ గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగిన దోపిడీని ఎండగట్టారు, జగన్మో హన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2024 కు ముందు పెట్రోల్, డీజిల్ ధరల్లో ఈ దేశం లోనే ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టారు, అడ్డగోలు గా రోడ్డు సెస్ వేసి, వ్యాట్ (vAT) పెంచి సామాన్య ప్రజలపై భారం మోపాడు,ఆనాటి మాజీ ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి, కేంద్ర ప్రభుత్వం ఇప్పుడుదేశవ్యాప్తంగా ఒక 3r మూడు రూపాయలు, ఈరోజు ఒక 97 పైసలు పెంచిన మాట నిజమే, కానీ దాన్ని పట్టుకుని మీరు ఈరోజు రోడ్లెక్కి ధర్నాలు చేస్తారా ? అసలు ఆనాటి మీ బాదుడుకు,ఈనాటి మీ ధర్నాలకు ఏమైనా సంబంధం ఉందా అని విజయ సాగర్ విమర్శించారు.