సబ్సిడీ ఆటో లబ్ధిదారులను, ప్రభుత్వమే ఆదుకోవాలి.
జనం న్యూస్, 20 ఆగస్టు 2026 , ఝరాసంగం మండలం, సంగారెడ్డి జిల్లా.సంగారెడ్డి జిల్లాలోని ఎస్సీ కార్పొరేషన్ ద్వారా, అనుభవజ్ఞులైన ఆటో డ్రైవర్లను ఎంపిక చేసి, వారికి సబ్సిడీ ద్వారా, మహీంద్రా ఆల్ఫా డీలక్స్, బిఎస్ 6, డీజిల్ ప్యాసింజర్ ఆటోలను పంపిణీ చేశారు. సెన్సార్లు కలిగిన ఈ ఆటోలు, ప్రయాణంలో, మార్గం మధ్యలోనే ఆగిపోతున్నాయని, ఫిర్యాదులు రావడంతో, వాహన విక్రయదారులు, వాహనంలోని లోపాలను గ్రహించి, ఈ ఆటోలను విక్రయించడం దాదాపు గత మూడు సంవత్సరాలుగా, మన ప్రాంతంలో, విక్రయాలను నిలిపివేశారని, తయారుచేసి,మిగిలిపోయిన ఈ నాసిరకమైన వాహనాలను, ఎస్. సి.కార్పొరేషన్ ద్వారా లబ్ధిదారులకు అందించి, ప్రభుత్వ అధికారులు లబ్ధిదారులను మోసం చేశారని, లబ్ధిదారులు తెలిపారు. ఈ ఆటోలు ప్రయాణంలో ఎన్నోసార్లు ఆగిపోవడంతో, ఈ ఆటోలను బాగు చేసుకోలేక, బి. ఎస్. 6, ఆటో ఇంజన్ లను తొలగించి, అప్పులు చేసుకొని, బి. ఎస్. 2,3,4, పాతకాలపు ఇంజన్లను బిగించుకొని, ఆటోలను నడుపుతున్నారని, బ్యాంకులో మిగిలిన అప్పులు తీర్చుకోలేక, తమ కుటుంబాలను పోషించుకోలేని స్థితిలో, దినసరి కూలీ పనులు చేస్తున్నారని, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఆటోలను పొందిన లబ్ధిదారులను ప్రభుత్వం ఆదుకోవాలని, రుణ విముక్తులను చేయడము, లేక ఈ ఇంజన్ ను తొలగించి, పాత మోడల్ ఇంజన్ బిగించి, వీరిని ఆదుకోవాలని, కోరుతున్నారు.