అయిజ మున్సిపల్ కేంద్రంలో సమస్యల పరిష్కారానికి భీమ్ ఆర్మీ వినతి

August 24, 2026 | తెలంగాణ

జనం న్యూస్ 24 ఆగస్టు 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ : జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ నియోజకవర్గం ఐజ మండలంలో ప్లాస్టిక్ కవర్లను నిషేదించాలి కంప చెట్లు తొలగించాలి గుంతలు పుడ్చాలని విశవాయువువదిలే చెట్లను తొలగించాలి మాంసం వ్యర్థల కంటేనార్ ను తొలగించాలి అయిజ మండలం ప్రజావాణి అధికారులకు భీమ్ ఆర్మీ నుండి వినతి పత్రం అందజేత అయిజ: అయిజ మున్సిపల్ కేంద్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న పారిశుద్ధ్య, పర్యావరణ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అయిజ మండల ప్రజావాణి కార్యక్రమంలో భీమ్ ఆర్మీ ఆధ్వర్యంలో అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ పరిధిలో ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని నిషేధించాలని, రోడ్ల వెంట ఉన్న కంపచెట్లను తొలగించాలని, రోడ్లపై ఏర్పడిన గుంతలను పూడ్చాలని, ప్రజలకు ఇబ్బందులు కలిగించే విషవాయువులు విడుదల చేసే చెట్లను తొలగించాలని అధికారులను కోరారు.అదేవిధంగా రోడ్డు పక్కన పేరుకుపోయిన మాంసం వ్యర్థాల కంటైనర్‌ను తొలగించి, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ప్రదేశంలో ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు ప్రజల ఆరోగ్యం పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని సమస్యలపై అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని భీమ్ ఆర్మీ నాయకులు కోరారు.భీమ్ ఆర్మీ ఉమ్మడి మహబూబ్ నగర్ ఇంచార్జి మాచర్ల ప్రకాష్ భీమ్ ఆర్మీ

🌐 Select Language:
📰 ePaper