ఎస్ఐఆర్ ప్రక్రియ విజయవంతంకు సహకరించాలి
జనం న్యూస్ 24 ఆగస్టు 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జ్ జోగులాంబ గద్వాల్ జిల్లా డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ పారదర్శకమైన ఓటరు జాబితాకు కృషి ఆగస్టు 27న వార్డ్ గ్రామ సభలుజిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ జోగులాంబ గద్వాల జిల్లాలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పారదర్శకంగా సమర్థవంతంగా నిర్వహించి విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అవసరమైన ఓటర్లకు నోటీసుల జనరేషన్, డెలివరీ అభ్యంతరాల స్వీకరణ తదుపరి హియరింగ్ ప్రక్రియలను వేగవంతం చేయడానికి మండలాల వారీగా నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందన్నారు.ప్రస్తుతం గద్వాల అలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో హేతుబద్ధీకరణ అనంతరం మొత్తం 594 పోలింగ్ స్టేషన్ల కు సంబంధించి 1,48,674 మంది ఓటర్లకు నోటీసులు ఇవ్వాల్సి ఉందన్నారు. ఇప్పటివరకు 47,218 నోటీసులు జనరేట్ కాగా, 31.76 శాతం పురోగతి నమోదైందని పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న నోటీసుల జనరేషన్‌ను త్వరితగతిన పూర్తి చేయడానికి సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఆగస్టు 22న బి ఎల్వో లు సంబంధిత బిఎల్ఏ లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి తగు సూచనలు చేశారన్నారు. ఈ సమావేశంలో నోటీసుల జనరేషన్, పెండింగ్ నోటీసుల పరిష్కారం, నోటీసుల డెలివరీ, ప్రజల అభ్యంతరాల స్వీకరణతో పాటు ఆగస్టు 27న ప్రతి గ్రామంలో నిర్వహించనున్న వార్డు, గ్రామ సభల ఏర్పాట్లపై సమగ్రంగా చర్చించి, సంబంధిత సిబ్బందికి సూచనలు చేశారన్నారు. గ్రామసభల్లో ప్రజలకు ఓటర్ల జాబితా మరియు సంబంధిత ప్రక్రియపై అవగాహన కల్పించడంతో పాటు ప్రజల అభిప్రాయాలు మరియు అభ్యంతరాలను స్వీకరించడం జరుగుతుందన్నారు. వార్డు గ్రామసభలు సజావుగా జరిగేలా అధికారులు బిఎల్ఓలు బిఎల్ఏలు ఇతర సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు ప్రజలు గ్రామసభలకు పెద్ద సంఖ్యలో హాజరై తమ పేరు కుటుంబ సభ్యుల వివరాలు మరియు ఓటుకు సంబంధించిన సమాచారాన్ని పరిశీలించుకోవాలని కోరారు.ఓటర్ల జాబితాలో తమ పేరు సక్రమంగా ఉందో లేదో ప్రతి ఒక్కరూ పరిశీలించుకోవాలని ఏవైనా తప్పులు లేదా అభ్యంతరాలు ఉంటే గ్రామసభలో సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.ఆగస్టు 27న నిర్వహించనున్న గ్రామసభలను ప్రజలు సద్వినియోగం చేసుకొని ప్రజాస్వామ్య ప్రక్రియలో తమ భాగస్వామ్యాన్ని నిర్ధారించుకోవాలని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు