పేద కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సహాయం

August 24, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ఆగస్టు 24: నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలంలోని మండలం తాళ్లరాంపూర్ గ్రామానికి చెందిన బోధసు గంగాధర్ జూన్ 14న ప్రమాదవశాత్తు తాటి చెట్టుపై నుంచి జారిపడి మృతి చెందారు. ఆయనకు భార్యతో పాటు ముగ్గురు కుమారులు ఉన్నారు. వారిలో ఇద్దరు కుమారులు అనారోగ్య సమస్యలతో బాధపడుతుండటంతో కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. మృతుడు బోధసు గంగాధర్ కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న తాళ్లరాంపూర్ మన ఊరు–మన బడి యూఏఈ ఎన్నారై సంఘం సభ్యులు మానవతా దృక్పథంతో స్పందించి కుటుంబానికి రూ.50,000 (యాభై వేల రూపాయలు) ఆర్థిక సహాయం అందించారు.ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు ఉత్కం శ్యామ్ సుందర్ గౌడ్, సృజన్ బండి, దేవేందర్ బోదాసు, ప్రతాప్ ముదిరాజ్, ఆడేము గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కుటుంబానికి అండగా నిలిచిన సంఘం సభ్యులను వడ్డెర కాలనీ వాసులు మరియు గ్రామస్థులు అభినందించారు.

🌐 Select Language:
📰 ePaper