నూతన వధూవరులను ఆశీర్వదించిన నందికొండ మున్సిపల్ వైస్ చైర్మన్ రాజా ప్రసాద్
జనం న్యూస్ -ఆగస్టు 24- నాగార్జునసాగర్ టౌన్-నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ కాకతీయ భవన్ (కమ్మ సేవా సంఘం) లో నందికొండ మున్సిపాలిటీ 5వ వార్డు నివాసితులైన బండి చంద్రమౌళి, కోటమ్మ దంపతుల కుమార్తె జయలక్ష్మి, మురళీకృష్ణ ల వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి హాజరు అయ్యి నూతన వధూవరులను ఆశీర్వదించిన నందికొండ మున్సిపల్ వైస్ చైర్మన్ గొడవర్తి రాజా ప్రసాద్, ఈ వేడుకలో ఆయన వెంట దుర్గాప్రసాద్, కాంగ్రెస్ నాయకులు ఉంగరాల శ్రీను, మోహన్ నాయక్, రాజేష్ రెడ్డి, అమిత్ బాల ప్రశాంత్ (సన్నీ), నాగవర్ధన్, పెద్దయ్య తదితరులు పాల్గొన్నారు.