నందలూరులో రక్తదాన శిబిరం: డాక్టర్ శరత్ కమల్‌కు ఆహ్వానం

August 24, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ ​నందలూరు: కడప జిల్లా 24/08/2026 ఈద్ ఏ మిలాద్ ఏ ముస్తఫా (సల్లల్లాహు అలైహి వసల్లం) రస్కరించుకుని, గవర్నమెంట్ రిజిస్ట్రేటెడ్ గెజిటెడ్ ఖాజీ మౌలానా మౌలి కాజా సయ్యద్ షా మైనుద్దీన్ హసన్ హుసాని రజ్వీ ఆధ్వర్యంలో ఈనెల 26వ తేదీన బృహత్ రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నారు.​ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిందిగా నందలూరు ప్రభుత్వ వైద్యశాల డాక్టర్ శరత్ కమల్‌ను నందలూరు దర్గా చిన్న పీఠాధిపతి గురువులయ్య సయ్యద్ హైదర్ సాహెబ్ మర్యాదపూర్వకంగా కలసి ఆహ్వాన పత్రికను అందించారు. ఆహ్వానాన్ని స్వీకరించిన డాక్టర్ శరత్ కమల్ మాట్లాడుతూ సమాజ సేవలో భాగంగా నిర్వహిస్తున్న ఈ రక్తదాన శిబిరానికి తప్పకుండా హాజరవుతానని తెలిపారు.
​ఈ కార్యక్రమంలో సయ్యద్ జుల్ఫికర్, పఠాన్ మెహర్ ఖాన్ మరియు ఇతర ముఖ్య నాయకులు, నిర్వాహకులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper