శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలో వైభవంగా వరలక్ష్మీ వ్రతం.

August 24, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ ఆగస్టు 22 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని అతి పురాతనమైన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలో శ్రావణమాస రెండో శుక్రవారం సందర్భంగా సామూహిక వరలక్ష్మి పూజలను దేవాలయ అర్చకులు ఆరుట్ల కృష్ణమాచారి వైభవంగా నిర్వహించారు. దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి పూజా కార్యక్రమాలకు ఏర్పాట్లు చేసినారు. మొదట గణపతి పూజ కలిశారాధన పూజ చేసి మహాలక్ష్మి అష్టోత్తరాలతో వరలక్ష్మి పూజను వైభవంగా నిర్వహించినారు. ఈ సందర్భంగా అర్చకులు కృష్ణమాచారి మాట్లాడుతూ మహిళలు శ్రావణమాసంలో వరలక్ష్మీ వ్రతం పౌర్ణమి ముందు వచ్చే శ్రావణమాసంలోని రెండవ శుక్రవారం చేసుకోవాలని అన్నారు మహిళలు భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతం చేస్తే సౌభాగ్యంగా సుమంగళిగా ఉంటారని అమ్మవారి ఆశీస్సులు ఉంటే అన్నిట్లో విజయం సాధిస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు…

🌐 Select Language:
📰 ePaper