సేవే మార్గం – ఆదుకోవడమే లక్ష్యం-విబిఎన్ ఫౌండేషన్

August 24, 2026 | వైరల్ వార్తలు

బ్రెయిన్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి విబిఎన్ ఫౌండేషన్ ఆర్థిక చేయూత

జనం న్యూస్- ఆగస్టు 24- నాగార్జునసాగర్ టౌన్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ 5వ వార్డుకు చెందిన పగిడి శ్రీను బ్రెయిన్ సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతూ వైద్య ఖర్చులు భరించలేక కుటుంబ పోషణ భారమై తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం స్థానిక నాయకులు వల్లపు నాగార్జున ద్వారా తెలుసుకున్న విబిఎన్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు దాసరి నినన్ సోమవారం రోజున నల్లగొండలో బాధితుడు పగిడి శ్రీను చికిత్స పొందుతున్న ఆసుపత్రికి చేరుకొని, బాధితుడిని పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు తక్షణ వైద్య సేవలకై ఆర్థిక చేయుత నందించారు, ఈ సందర్భంగా దాసరి నినన్ మాట్లాడుతూ ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు అండగా ఉండటమే తమ సంస్థవిబిఎన్ ఫౌండేషన్ లక్ష్యమని, పగిడి శ్రీను ఆరోగ్యానికి సంబంధించి డాక్టర్ ను సంప్రదించగా వైద్య చికిత్సలకు అధిక మొత్తంలో ఖర్చు అవుతుందని తెలిపారని, కావున ఇతర దాతలు కూడా ముందుకు వచ్చి తమ వంతు ఆర్థిక సహాయం ఆ కుటుంబానికి అందించి ఒక నిండు ప్రాణాన్ని కాపాడాలని కోరారు,భవిష్యత్తులో ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించడానికి విబిఎన్ ఫౌండేషన్ తరపున కృషి చేస్తున్నామని తెలిపారు. విబిఎన్ ఫౌండేషన్ డైరెక్టర్ నూకల చెన్నారెడ్డి మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులు, అత్యవసర వైద్య చికిత్సలకు, ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలను ఆదుకోవడమే లక్ష్యంగా విబిఎన్ ఫౌండేషన్ సంస్థ పనిచేస్తుందని, ఆపదలో ఉన్న కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడమే మానవత్వానికి నిదర్శనం అని, నిరుపేదలకు అండగా నిలబడటమే విబిఎన్ ఫౌండేషన్ లక్ష్యంఅని తెలిపారు, ఈ కార్యక్రమంలో వారి వెంట గడ్డం రామకృష్ణ, ఆదాసు విక్రం, మైలపల్లి రమణ, తేజ, నల్లగొండ సాల్మన్ రాజు, పగిడి నాగమ్మ, దీపం రమణ తదితరులు ఉన్నారు.

🌐 Select Language:
📰 ePaper