మంత్రి సుభాష్ చొరవతో గొల్లపాలెం- కుయ్యేరు రోడ్డుకు మోక్షం
జనం న్యూస్ ఆగస్టు 24 ముమ్మిడివరం ప్రతినిధి (గ్రంధి నానాజీ) రూ.37.65 కోట్ల రోడ్డు నిర్మాణ పనులు వేగవంతం
దశాబ్దాల నిరీక్షణకు కూటమి ప్రభుత్వంతో తెర పనులను పరిశీలించిన మంత్రి వాసంశెట్టి సుభాష్ అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ విషప్రచారం:నియోజకవర్గాన్ని సువర్ణ రామచంద్రపురంగా తీర్చిదిద్దుతారాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ చొరవతో గొల్లపాలెం – కుయ్యేరు రోడ్డుకు ఎట్టకేలకు మోక్షం లభించింది. దశాబ్దానికి పైగా నిధుల కొరతతో నిర్మాణానికి నోచుకోకుండా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన గొల్లపాలెం–కుయ్యేరు రహదారికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముగింపు పలికింది. రూ.37.65 కోట్ల భారీ వ్యయంతో చేపట్టిన సుమారు 13 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.కాజులూరు మండలంలో జరుగుతున్న ఈ రోడ్డు నిర్మాణ పనులను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రోడ్డు నిర్మాణంలో ఉపయోగిస్తున్న నాణ్యతా ప్రమాణాలను పరిశీలించి, పనులు నాణ్యతతో పాటు నిర్ణీత గడువులోగా పూర్తయ్యేలా ఆర్‌అండ్‌బీ అధికారులకు తగిన సూచనలు చేశారు. ఇప్పటికే రూ.19.25 కోట్ల మేర పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులను కూడా వేగంగా పూర్తి చేస్తామని తెలిపారు.ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా రహదారులు గుంతలమయంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని విమర్శించారు. అభివృద్ధి పనులు చేపట్టకుండా కాలయాపన చేసిన గత పాలకులు ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక విషప్రచారానికి దిగుతున్నారని మండిపడ్డారు.గొల్లపాలెం–కుయ్యేరు రోడ్డు విషయంలో వైసీపీ నాయకులు ఎన్ని విమర్శలు చేసినా, కూటమి ప్రభుత్వం ప్రజల అవసరాన్ని గుర్తించి నిధులు మంజూరు చేసి పనులను ప్రారంభించిందన్నారు. వివిధ దేశాల్లో నెలకొన్న యుద్ధ పరిస్థితుల కారణంగా తారు, ఇతర ముడి సరుకుల లభ్యతలో ఏర్పడిన ఇబ్బందుల వల్ల పనుల్లో కొంత ఆలస్యం జరిగిందని, ప్రస్తుతం పనులు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. మాటలతో కాకుండా చేతలతో అభివృద్ధిని చూపిస్తున్నాం. రామచంద్ర పురం నియోజకవర్గాన్ని రానున్న రోజుల్లో ‘సువర్ణ రామచంద్రపురం’గా తీర్చిదిద్దుతా” అని మంత్రి సుభాష్ స్పష్టం చేశారు.కాజులూరు మండల అభివృద్ధికి మరో రూ.16 కోట్లుకాజులూరు మండల సమగ్ర అభివృద్ధికి మరో రూ.16 కోట్ల నిధులు మంజూరయ్యాయని మంత్రి వెల్లడించారు. అలాగే గొల్లపాలెం చెరువు అభివృద్ధికి సీఎస్‌ఆర్ నిధుల నుంచి రూ.2 కోట్లు మంజూరు చేయించేందుకు చర్యలు కున్నామని తెలిపారు.సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని, అభివృద్ధి–సంక్షేమాన్ని సమతుల్యంగా ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం అభివృద్ధిలో శరవేగంగా దూసుకుపోతోందని పేర్కొన్నారు. చోడవరం కబేళా సమస్యకు శాశ్వత పరిష్కారం రామచంద్రపురం రూరల్ మండలం చోడవరంలో నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతున్న కబేళా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపామని మంత్రి తెలిపారు. కబేళాను మూసివేసి, అక్కడి నిర్వాహకులకు ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పిస్తామని అన్నారు. దీంతో నాలుగో దశాబ్దాల సమస్యకు పరిష్కారం లభించింది అన్నారు.వైసీపీ పాలనలో విధ్వంసమైన రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం తిరిగి అభివృద్ధి బాటలోకి తీసుకొస్తోంది. ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ సూపర్ సిక్స్‌ను సూపర్ హిట్ చేసామన్నారు. రామచంద్రపురం నియోజకవర్గ అభివృద్ధికి మరిన్ని నిధులు తీసుకొచ్చి, ప్రతి గ్రామానికి మౌలిక వసతులు కల్పిస్తా అని మంత్రి సుభాష్ అన్నారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ అక్కల రిశ్వంత్ రాయ్, ఎంపీడీవో జె రాంబాబు, ఆర్ అండ్ బి జె ఈ ప్రసన్న, కాజులూరు మండల టీడీపీ అధ్యక్షులు చవ్వాకుల నారాయణమూర్తి, అన్యం శ్రీరామచంద్రమూర్తి, జనసేన అధ్యక్షులు బొండా వెంకన్న, చుండ్రు వీర్రాజు చౌదరి అంగర కృష్ణ, సొసైటీ అధ్యక్షులు కోట తాతబ్బాయి,వనుం వీరబ్రహ్మం,రెడ్డి శేషారావు, దడాల నాగార్జున, మేడిశెట్టి వీర వెంకట సత్యనారాయణ, ధరణి, చందాల మల్లిబాబు, తాడి రామారెడ్డి, తోట కృష్ణ, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు,కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు, ఆర్‌అండ్‌బీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.