— నేనే మానస ను గొంతు పిసికి చoప్పినాను….–మృతురాలి తండ్రే చంపు మని డబ్బులు పంపాడు…
ఎ సి పి ప్రెస్ మీట్ లో నిందితుడు ఏడేల్లి వినోద్ రెడ్డి
జనం న్యూస్ ఆగష్టు 24 2026(ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ ) మండల కేంద్రములో స్థానిక సి ఐ కార్యాలయంలో ఇటీవల జరిగిన. కారు డిక్కిలోగుర్తూ తెలియని మహిళ శవం అనే వరస కథనాలు వచ్చిన విషయం తెలిసిందే…. ఈవిషయం పై కాజీపేట ఎ సి పి ప్రశాంత్ రెడ్డి. సి ఐ పులి రమేష్ ఎస్సై నరసింహారావు ఆధ్వర్యములో విలేకర్ల సమావేశములోనిదితున్ని ముందుంచారు నిందితుడు ఏడేల్లి వినోద్ కుమార్ రెడ్డి జరిగిన విషయాన్ని తెలిపారు తేదీ 21 -8-2026 న ఎల్క్ తుర్తి గ్రామములోని వ్యవసాయ మార్కెట్ చెక్ పోస్ట్ పక్క గల్లీలో కారు పార్కింగ్ లో నుండి దుర్వసన వస్తుందన్న విషయాన్ని స్థానికులు సమాచారం పై గ్రామ కార్యదర్శి శ్రీనివాస్ అక్కడికి వెళ్లి చూడగా కారు డిక్కీలో మహిళా మృత దేహం ఉందని వయస్సు 35 ఏండ్లు ఉంటుందని ఎక్కడో చంపి తీసుకొచ్చి కారును పార్కు చేసిన విషయాన్ని స్థానిక పోలీసులకు చెయ్యగా వారి ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేయడం జరిగిందని ఈ ఘటనపై సిపి వరంగల్ మరియు సెంట్రల్ జోన్ డిసిపి ధారా కవిత మరియు ఎ సి పి ప్రశాంత్ రెడ్డి కాజీపెట్ ఆదేశాల మేరకు స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో మూడు బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలిస్తుండగా 23-8- 2026 న గ్రామ శివారులో సిఐ మరియు ఎస్సై వారి సిబ్బందితో నమ్మదగిన సమాచారం మేరకు పెట్రోలింగ్ చేస్తుండగా నాగర్జున సీడ్స్ ప్రాసెస్ ప్లాంట్ వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని అతని విచారించగా తన పేరు వినోద్ కుమార్ తండ్రి సమ్మిరెడ్డి 34 ఏళ్లు ప్రైవేట్ జాబ్ చేస్తున్నట్లు తెలిపారు తండ్రి ఉద్యోగరీత్యా గోదావరిఖనిలో ఉండడం వలన ఇతను చిన్ననాటి నుంచి గోదావరిఖనిలో చదువుకున్నట్లు వారు తెలిపారు అదే గోదావరిఖని చెందిన మానస అనే అమ్మాయి తనకు చిన్ననాటి నుండి స్నేహితులుగా తనతో కలిసి మెలిసి ఉండేవారని సదరు మ్మాయికి ఇంతకుముందే రెండు పెళ్లిళ్లు కాగా వీరికి ఈమధ్య విడాకులు కూడా అయిందని చెప్పారు. మానస విచ్చలవిడిగా తిరుగుతున్న క్రమంలో తల్లిదండ్రుల మాట వినకుండా జల్సాలకు అలవాటపడి తల్లిదండ్రులపై చెడు పేరు తెస్తుందన్న ఉద్దేశంతో వినయ్ కుమార్ రెడ్డి నీ సంప్రదించారు తండ్రే చoపమని డబ్బులు పంపాడు మానస తండ్రి అయిన అంకిత రాజేశం నిందితుడు వినయ్ కుమార్ రెడ్డి తో చెప్పి ఏదో ఒకటి చెయ్యoడి నా భిడ్డతో చాలా ఇబ్బందిగా ఉందని అన్నట్లు విలేకర్ల సమావేశములో నిందితుడు వెల్లడించారు.. ఖర్చులకు డబ్బులు కూడా పంపారని అన్నారు. 18-8-2026 రోజున కరీంనగర్ లోని తన రూముకి వచ్చి పెళ్లి చేసుకొమ్మని వాదించారని ఆవిషయాన్ని తన తండ్రి రాజేషంకు వివరించాగ అదే రాత్రి నేను గొంతు నలిపి చంపినానీ ఎ సి పి ప్రశాంత్ రెడ్డి ముందు వినయ్ రెడ్డి ఒప్పుకున్నారు సిఐ ఎస్సై నీ అభినందించిన ఎసీపీ నిందితున్ని చాకచక్యంగా పట్టుకున్నందుకు ఎల్క తుర్తి సిఐ పులి రమేష్ ఎస్సై నరసింహారావు.ను పోలీస్ కానిస్టేబుళ్లు విఠల్ బక్కయ్య సిబ్బందిని కాజీపేట ఏసీపి ప్రశాంత్ రెడ్డి అభినందించారు