ఎమ్మార్వో కార్యాలయం ముందు ఒంటరి మహిళల నిరాశ.. ఎంఏ ఎగ్బాల్
జనం న్యూస్ 24 ఆలేరు యాదాద్రి జిల్లా మండల రిపోర్టర్ ఎండి జహంగీర్ ఆలేరు పట్టణoలో ఎమ్మార్వో కార్యాలయం ముందు ఒంటరి మహిళల నిరాశ అధికారుల నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారని సిపిఎం జిల్లా నాయకులు ఎంఏ ఇక్బాల్ ఆవేదన వ్యక్తం చేశారు అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వం ఇస్తున్న చేయూత పెన్షన్లలో భర్తల అనాధరణకు గురైన ఒంటరి మహిళలకు చేయూత అందించాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ వారిని గుర్తించి సర్టిఫికెట్లు మంజూరు చేయాలని ఎమ్మార్వో కి ప్రభుత్వం అప్పజెప్పినప్పటికీ వారికి ఎంక్వయిరీ చేసి సర్టిఫికెట్లు అందించడంలో ఆలేరు రెవెన్యూ కార్యాలయంలో తీవ్ర జాప్యం జరుగుతుంది అని 15 రోజులుగా కార్యాలయం చుట్టూ తిరిగిన అధికారులు స్పందించడం లేదని వీరి సమస్యను పరిష్కరించి అర్హులైన మహిళలకు సర్టిఫికెట్లు అందించడంలో రెవెన్యూ అధికారుల స్పందన కరువైందని అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పెండింగ్లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిశీలించి అర్హులైన ఒంటరి మహిళలకు సర్టిఫికెట్లు జారీ చేయాలని డిమాండ్ చేశారు.