ఎస్ ఐ ఆర్ ఫై గ్రామ సభలు– ప్రజలు సద్వినియోగం చేసుకోవాలిడోంగ్లి మండలం, తాసిల్దార్
జుక్కల్ ఆగస్టు 26 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం డోంగ్లి మండలంలోని సమస్త రాజకీయ పార్టీ అధ్యక్షులకు, బూత్ స్థాయి ఏజెంట్లకు (BLA), ప్రజాప్రతినిధులకు, సమస్త BLOలకు, పాత్రికేయులకు మరియు ప్రజలందరికీ తెలియజేయునది ఏమనగా:గౌరవ ముఖ్య ఎన్నికల అధికారి (CEO) గారి ఆదేశాల మేరకు, తేదీ 27.08.2026 (గురువారం) నాడు డోంగ్లి మండల పరిధిలోని సమస్త BLOలు తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రానికి సంబంధించిన గ్రామంలో గ్రామ సభ నిర్వహించబడుతుంది.ఇందులో SIR ముసాయిదా ఓటర్ల జాబితా మరియు Uncollectible ఓటర్ల జాబితా ప్రజల సమక్షంలో చదివి వినిపించబడుతుంది.జారీ చేయబడిన నోటీసులకు, తగు సంబంధిత ఆధారాలు కింద తెలుపబడిన విచారణ తేదీలలో సమర్పించగలరని తెలుపనైనది.కావున, మండలంలోని రాజకీయ పార్టీ ప్రతినిధులు, BLAలు, ప్రజాప్రతినిధులు మరియు గ్రామ ప్రజలందరూ తేదీ 27.08.2026 న జరిగే ఈ గ్రామ సభలలో పాల్గొని, విచారణ తేదీలలో మీ యొక్క గ్రామ పంచాయతీ కార్యాలయము, డోంగ్లి యందు హాజరయ్యి, మీ యొక్క ఓటుకు సంబంధించి నోటీసులకు వివరాలు ఇస్తూ ఓటు నమోదుకు సహకరించవలసిందిగా తాసిల్దార్ కోరడమైనది.