బస్వాపూర్ గ్రామ డ్వాక్రా సంగం నూతన కమిటీ ఎన్నిక

August 26, 2026 | వైరల్ వార్తలు

జుక్కల్ ఆగస్టు 26 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం బస్వాపూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో డ్వాక్రా సంఘ సభ్యుల సమావేశం జరిగింది ఈ సమావేశానికి గ్రామ సమాఖ్య అధ్యక్షురాలు. మే త్రీ. హనుమవ్వ అధ్యక్షతన సమావేశం జరిగింది ఈ సమావేశ నికి. గ్రామ సర్పంచ్. శ్రీమతి. వి. రమణ సురేష్ గొండ. ముఖ్యఅతిథిగా పాల్గొని కొన్ని ముఖ్యమైన సూచనలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానంతరం బస్వాపూర్ గ్రామ సమైక్య నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షురాలుగా. హనుమవ్వ. ఉపాధ్యక్షురాలుగా. సోనీ. కార్యదర్శిగా. రామవ్వ. సహాయ కార్యదర్శిగా. సునీత. కోశాధికారిగా. లక్ష్మీబాయి. లను నేటి జనరల్ బాడీ సమావేశం లో పాల్గొన్న సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో. సీసీ. సంజు. వివో. భాస్కర్ చిన్న సంఘాల లీడర్లు సంఘ సభ్యులు హాజరైనారు.

🌐 Select Language:
📰 ePaper